శని దయతో ఈ రాశులకు 2027 వరకు తిరుగులేదు!

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత శనిదేవుడు మార్చిలో మీనరాశిలోకి ప్రవేశించాడు. తిరిగి 2027లో మరో రాశిలోకి సంచారం చేయనుంది. ఒక రాశి నుంచి మరో రాశికి మారేందుకు శని రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటుంది. మీనరాశి బృహస్పతి సొంత రాశి. ఈ పరిణామం వల్ల ఏయే రాశులకు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలున్నాయి? వారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాలను తెలుసుకుందాం.

మిథునరాశి
వీరికి 2027 వరకు చాలా బాగుంటుంది. వ్యాపారాల్లో ఉన్నవారికి విజయాలు అలవోకగా వస్తాయి. ఏ పని తలపెట్టినా శుభం జరుగుతుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారి కోరిక నెరవేరుతుంది. మంచి ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులు ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. ఈ రాశివారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శనిదేవుడిని పూజించడంద్వారా అమితమైన లాభాలు పొందుతారు. పెండింగ్ పనులు పూర్తిచేయడంతోపాటు ఎప్పటినుంచో అనుకుంటున్న పనులన్నింటినీ పూర్తిచేస్తారు.

With the grace of Saturn the lives of three zodiac signs are going to be wonderful till 2027

ధనుస్సు రాశి
కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. అందరిమధ్య ఐకమత్యం ఉంటుంది. ఎటువంటి పని చేసినా వీరికి లాభమే కలుగుతుంది. 2027 వరకు ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. అన్నీ సక్రమంగా సాగుతాయి. అద్భుతమైన లాభాలను పొందడానికి వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. ఏ పని చేసినా వీరికి అంతా లాభసాటిగానే ఉంటుంది.

తులారాశి
వీరికి ఆర్థిక లాభాలు భారీగా ఉంటాయి. కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరతాయి. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బలపడతారు. ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులున్నాయి.. వాటితోపాటు వేతనాలు పెరుగుతాయి. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. శత్రువుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శని దేవుడిని పూజించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+