2 రాజయోగాలతో రేపటి నుంచి ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే

డిసెంబరు 12, 13, 14 తేదీల్లో అరుదైన రెండు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతికి మధ్యలో చంద్రుడు వస్తాడు. దీనివల్ల గజకేసరి యోగం ఏర్పడుతోంది. అలాగే ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్న కుజుడికి మధ్యలోకి చంద్రుడు రావడంతో చంద్ర మంగళ యోగం ఏర్పడుతున్నాయి. ఈ రెండు యోగాలవల్ల ఆరు రాశులకు అద్భుతంగా కలిసివస్తోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆయా రాశుల వివరాలు, వారికి ఎలా కలిసివస్తోందనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
రాదు అనుకున్న సొమ్ము చేతికి అందుతుంది. బాకీలన్నీ అందుతాయి. ఆస్తి వివాదానికి పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగంలో వేతనాలు పెరుగుతాయి. వివిధ రంగాల్లో ఉన్నవారందరికీ రాబడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. స్టాక్ మార్కెట్ వ్యాపారం బాగుంటుంది.

With two powerful Raja Yogas everything six zodiac signs touch will turn to gold from tomorrow onwards

ధనుస్సు రాశి
నిరుద్యోగులకు విదేశాల్లో అవకాశాలు వస్తాయి. సమాజంలో కీలకమైన వ్యక్తులతో పరిచయం కలుగుతుంది. పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులకు సంతానం కలుగుతుంది. బాగా డబ్బుకన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడతారు. కుటుంబంలో శుభాలు జరుగుతాయి.

మీన రాశి
ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న నిరుద్యోగులకు అవకాశం కలుగుతుంది. వృత్తితోపాటు వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగం చేస్తున్నవారు తిరిగి మరో ఉద్యోగంలోకి మారతారు.

మేషరాశి
ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది. వేతనాలు పెరగడంతోపాటు ప్రమోషన్స్ ఉంటాయి. వ్యాపారంలో, వృత్తుల్లో చురుగ్గా ఉంటారు. యాక్టివిటీ పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు బాగా కలిసివస్తాయి. అవి మంచి లాభాలను కలిగిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారికి ఇప్పుడు మంచి అవకాశాలు వస్తాయి.

మిథున రాశి
సంపన్నులైన కుటుంబంతో వివాహం కుదురుతుంది. ఏ పని తలపెట్టినా విజయం చేకూరుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి.

కన్యా రాశి
ఆదాయం భారీగా పెరుగుతుంది. కుటుంబంలో శుభాకార్యాలు జరుగుతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. ఆస్తులు కలిసివస్తాయి. ఇంటి యోగంతోపాటు కొత్త వాహన యోగం కూడా ఉంది. అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+