వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జంధ్య ధారణపై గ్రహణం ఎఫెక్ట్: ఉపాకర్మ విశేషాలు..

జందాల పున్నమినాడు చేయు కర్మకు ఉపాకర్మ అను పేరు ఆరూఢమై ఉన్నది.

|
Google Oneindia TeluguNews

గ్రహణం కారణంగా జంధ్యాల ధారణ, ఉపాకర్మల్లో మార్పులు ఇవి

ఈసారి గ్రహణము కారణంగా సామాన్యులు జంధ్యాలు రెండుసార్లు మార్చుకోవాలి
ఉపాకర్మ యజుర్వేదులకి భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు 03.09.2017 నాడు చేసుకోవాలి.
ఋగ్వేదులకి (ఈఏడాది లేదు) వచ్చెసంవత్సరము శ్రావణ పున్నమి నాడు చేసుకోవాలి.

శ్రావణ పౌర్ణిమ ప్రత్యేకత ..

శ్రావణి బ్రాహ్మల పండగ. దసరాక్షత్రియులకు, దీపావళి వైశ్యులకు, హోలీ పండుగ శూద్రులకు అనే అనుస్యూతమైన ఆచారం ఏర్పడింది.

పూర్వకాలంలో శ్రావణపౌర్ణమి రోజున ఉపాకర్మానంతరం వేదవిద్య నేర్చుకోవడం ప్రారంభించేవారు. శ్రావణి
దక్షిణభారతం, గుజరాతు, ఒరిస్సా, బెంగాలులలో మాత్రమే బాగా జరుగుతుంది. పంజాబు, రాజపుటానాల్లో తక్కువ.
శ్రావణి పూజ చేయడం అక్కడక్కడ వుంది.

మాతపితృభక్తుడైన శ్రవణుడి పరంగా జరిగే పర్వమిది అని స్త్రీలు తలుస్తారు. ఈ శ్రవణుడు దశరథుని చేత చంపబడినట్లు చెబుతారు. కాని ఇది యదార్ధము కాదు. శ్రావణి వైదిక పాకయజ్ఞానికి సంబంధించినది. కాని శ్రవణుడనే వ్యక్తికి సంబంధించింది కాదు. రక్షాబంధనం, ఉపాకర్మలతో సంబంధించిందిగాక ఇది స్వతంత్రమైంది.

దక్షిణదేశంలో శ్రావణపూర్ణిమకు పావతి పూర్ణిమ అని అంటారు. ఆ రోజున విష్ణుశివ గణేశులను పూజ చేస్తారు. దీనినే బొంబాయి ప్రాంతంలో నార్లీపూర్ణిమ అంటారు. ఆనాడు అక్కడ వరుణ దేవుని పూజ కోసం సముద్రుని పూజిస్తారు. ఆ రోజుల్లో సముద్రం ప్రశాంతంగా వుంటుందని వారి నమ్మిక. అందుచేత పూర్వకాలంలో సముద్రాంతర వర్తకానికి ఈ కాలాన్ని ఉపయోగించే వారు. తిరిగి రావడానికి కూడా ఇదే సమయాన్ని ఎంచుకునేవారు.

ఆనాడు యజ్జోపవీతాలు, నారికేళాలు సముద్రంలో పడవేస్తారు. అందుచేత దీనికి నారికేళపూర్ణిమ అని పేరు వచ్చింది. సర్వరోగోపశమనం కొరకు సర్వాశుభవినాశనం కొరకు యుధిష్టరుడు శ్రీకృషున్ని ఉపాయం అడిగాడు. శ్రీకృషుడు రక్షాబంధన విధి ఉపదేశించాడు.

దేవాసుర యుద్దంలో ఇంద్రుడికి ఇంద్రాణి రక్షాబంధనం ఇచ్చి జయం సంపాదించిందని చెప్పినాడు. రక్షాబంధనం విధి శ్రావణపౌర్ణమినాడు జరుగుతుంది. శాస్త్రంలో రక్షాబంధనం భార్య భర్తకు కట్టాలనివున్నా ఆచరణలో చెల్లెలో చెల్లెలు కూతురో కట్టుతూ ఉంది. అని వ్రతోత్సవచంద్రిక వివరిస్తోంది.

ఉపాకర్మ యొక్క విశేషాలు

ఉపాకర్మపండుగ కాదు. అధ్యయనానికి సంబంధించిన కర్మ పక్షికి ద్విజము అని పర్యాయనామం. ద్విజము అనగా రెండు సారులు పుట్టినది అని అర్థము. అది మొదట గుడ్డుగా పడుతుంది. గుడు పగులుకొని పక్షిగా పుడుతుంది.
పక్షివలె హిందూ సంఘంలోని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, కూడ ద్విజులు. తల్లి కడుపునుండి ఒక పుట్టుక రెండో పుట్టుక గురువు, తలిదండ్రులు ఉపనయనము చేసిన తరువాత,
ఉపనయనము ముఖ్యములైన వైదిక కర్మలలో ఒకటి. ఉపనయనము అనగా అదనపు కన్ను అని అర్థము. గురువు తన ప్రజ్ఞాప్రాభవముల చేత వటువునకు జ్ఞాననేత్రము తెటిపించును.

ఉపనయన సందర్భంలోనే యజ్జోపవీత ధారణ. "ఎలక్ట్రిక్ బల్బులోని కార్బన్ ఫిలమెంట్ వతుది యజ్జోపవీతం అనవచ్చును అని అంటున్నారు శ్రీ జగదీశ అయ్యరు.

యజ్జోపవీతం-యజ్ఞ+ఉపవీతం అనే రెండు సంస్కృత పదాల సమాసపదము. యజ్ఞము అనగా యాగము ఉపవీతము అనగా దారము. యాగ కర్మచేత పునీతమైన దారము అని భావము. మూడ పోచల ముడితో కూడినది. దీనిని వడకడానికి పత్తిని బ్రాహ్మణుడు స్వయంగా సేకరించాలి. స్వయంగా గింజలు శ్రీసి వడకాలి.

ఎడమభుజము మిూదుగొ కుడి తుంటి విూదకు వ్రేలాడేటట్ల వేసుకొనబడును. నాలుగు కులాలలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే దీనిని ధరించటం ఆచారంగా ఉంది. ఎనిమిదేళ్లు దాటిన తరువాత పన్నెండేళ్ల లోపుగా బ్రాహ్మణబాలురకు ఉపనయనం చేసి ఒంటిముడి యజ్జోపవీతాన్ని వేసి పఠనానికి ప్రారంభం చేయడం బ్రాహ్మణుల ఆచారమై ఉండేది.

ఒక ముడిలోని మూడు తాళ్లు త్రిమూర్తులను అనగా సృష్టి స్థితి, లయ కారులైన బ్రహ్మ విప్ళ మహేశ్వరులను సూచిస్తాయి అని కొందరు అంటారు. మరికొందరు అవి మనోవాక్కాయములను సూచిస్తాయి అంటూరు.
అరవంలో యజ్జోపవీతాన్ని పూనూల్ అంటారు. పూనూల్ అనగా పుణ్యవంతమైన తాడు అని అర్థము. తెనుగులో దీనిని జందెము అంటారు.

బ్రాహ్మణులు స్వయంగా వడికిన జందాన్ని ఇతరులకు ఈయడం వల్ల పుణ్యం వస్తుందని నమ్మకం. యజ్జోపవీతధారణం ద్వారా ఆధ్యాత్మిక సంపద అభివృద్ధి పొందుతుందనీ, సంపద నలుగురికీ పంచి ఈయడం అలవాటు కాబట్టి జంధ్యములు పంచడము ద్వారా ఆధ్యాత్మిక సంపద పంచినట్లు అవుతుందని బ్రాహ్మణ సంఘంలో నమ్మకం ప్రబలి ఉండేది.

వైదిక బ్రాహ్మణుడు తాను బ్రహ్మణీకం నెరపే గృహాల యజమానుల కందరికీ ఏడాదికి సరిపడే జందెములు శ్రావణి పూర్తిమ సందర్భంలో -ఈయడం ఒక ఆచారంగా ఏర్పడి నేటికిన్నీ సాగుతూ ఉంది.
బ్రాహ్మణులలో యజుర్వేదశాఖవారు, ఋగ్వేదశాఖవారుశ్రవణా నక్షత్రంతో కూడిన శ్రావణ పౌర్ణమినాడు ఉపాకర్మం చేస్తారు. అనగా నూతన యజ్జోపవీత ధారణం జరుపుతారు.

శ్రావణపౌర్ణమినాడు వేదపఠనము మిక్కిలి పవిత్రకార్యంగా ఎంచబడుతూ ఉంది. పితరులకు నేడు తర్పణం విడుస్తారు.
ఒక జందెంలోని మూడు తాళు మనోవాక్కాయ కర్మలను సూచిస్తాయి. మనోవాక్కాయ కర్మలను అదుపులో ఉంచుకున్న దానికి సూచనగా జందెం ధరిస్తారనీ, బ్రహ్మముడి మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకోవడాన్ని తెలియజేస్తుందని చెబుతారు.

శ్రావణ శుక్ల పూర్ణిమకు శ్రావణి అని పేరు. శ్రావణిని తెలుగువారు කරයිඵ పూర్ణిమ అంటారు. జందాలు ధరించే జాతుల వారు అందరూ ఈనాడు కొత్త జందాలు వేసుకోవడం ఆచారంగా ఉండడం చేత దీనికి జందాల పన్నమని పేరు వచ్చింది.

 Yagnopaveeda Dharana Mantra Poonal

జందాల పున్నమినాడు చేయు కర్మకు ఉపాకర్మ అను పేరు ఆరూఢమై ఉన్నది. అది అధ్యయనాంగ భూతకర్మ
"భారతీయులగు చాతుర్వర్ణ్య ప్రజలలో బ్రాహ్మణ క్షత్రియవైశ్యులు ద్విజులనఁబడుదురు. వీరికిఁగావింపఁబడు ఉప నయన మను సంస్కారముచే ద్వితీయ జన్మము ఏర్పడుచున్నది. మాతాపితరుల వలన నేర్పడునది ప్రథమ జన్మమనియు, మౌంజీ బంధనమున నేర్పడునది ద్వితీయ జన్మమనియు తెలియబడును. ఉపనయన సంస్కారమునందు

English summary
Upanayana is an important Samskara, duty of a Hindu.The three Varnas, Brahmana, Kshatriya and Vaisya must have this performed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X