అమ్మమ్మల నాటి 'చద్దన్నం'.. ఇలా సింపుల్ గా చేసుకోండి..!
ప్రస్తుతం ఉన్న ఒత్తిడి లైఫ్, ఉరుకులు పరుగులు జీవితం దృష్ట్యా పాతకాలం నాటి ఆరోగ్యకరమైన వంటలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అందులో భాగంగానే ఇటీవలి కాలంలో చద్దన్నం బాగా ఫేమస్ అవుతోంది. చాలా ప్రాంతాల్లో చద్దన్నం స్టాల్స్ దర్శనమిస్తున్నాయి. చద్దన్నం జీర్ణశక్తిని పెంచుతుంది. ఉష్ణాన్ని తగ్గిస్తుంది. అలాగే గట్ హెల్త్ కు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. బాడీకి కూడా చద్దన్నం కూలింగ్ ఇస్తుంది. మరి ఈజీగా చద్దన్నం ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
చద్దన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే ఒకటిన్నర కప్పు ఉడికించిన అన్నం, ఒక కప్పు గోరువెచ్చని నీరు, ఒక కప్పు గోరువెచ్చని పాలు, రెండు టేబుల్ స్పూన్ ల మజ్జిగ, ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిరపకాయలు, ఉప్పు తగినంత తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే.. ముందుగా వండిన అన్నంలో గోరువెచ్చని నీరు, పాలు పోసి బాగా కలపాలి.

ఆ తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం పాల మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు.. కొన్ని చుక్కలు మజ్జిగ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేయాలి. వాటిని బాగా కలిపి మూతపెట్టి రాత్రంతా అలాగే వదిలేయాలి. పొద్దున్నే తినేయండి.. చాలా టేస్టీగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు మేలు చేసే బ్యాక్టీరియా కారణంగా పులియబెట్టిన పాలలో బియ్యం గట్టిపడుతుంది. రుచికి తగినంత ఉప్పు కలుపుకుని చద్దన్నం మంచి గుణాలను ఆస్వాదించొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చద్దన్నం ఇలా ఈజీగా చేసుకోండి..












Click it and Unblock the Notifications