అదృష్ట రాశులు ఇవే.. అన్నింటిలో విజయమే
ప్రభుత్వ పనిలో విజయం సాధిస్తారు. పిల్లల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. ఆస్తికి సంబంధించిన పత్రాలు చేయడానికి మాత్రం గురువారం మంచిరోజు కాదు. నమ్మకంగా ఉండటంవల్ల ప్రతి పని సులువుగా పూర్తి చేస్తారు. మొత్తం 12 రాశులున్నప్పటికీ అదృష్ట రాశులు కొన్నే ఉంటాయి. ఈరోజు మొత్తానికి అదృష్ట రాశులెవరో తెలుసుకుందాం.
మిథున రాశి: అదృష్టం తోడుగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలున్నాయి. ఆలోచనల్లో స్థిరత్వం లేకపోవడంవల్ల గందరగోళానికి గురవుతారు. ఇరుగు పొరుగుతో, స్నేహితులతో సత్సంబంధాలుంటాయి.

సింహ రాశి: సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రవర్తన దూకుడుగా ఉండటంవల్ల కొందరితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. తండ్రి నుంచి లేదంటే పెద్దల నుంచి ప్రయోజనం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు.
తుల రాశి: అదృష్టం వెంటే ఉంటుంది. మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. పిల్లలు, భార్య నుంచి ఆనందాన్ని పొందుతారు. వ్యాపారంలో పెరుగుదల కనపడుతోంది.
వృశ్చిక రాశి: ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. పెద్దల నుంచి, పై అధికారుల నుంచి సహాయంతోపాటు ప్రోత్సాహం ఉంటుంది. పిల్లల వైపు నుంచి ఉన్న ఆందోళన నుంచి విముక్తి పొందుతారు. ప్రతి పనిలోను విజయం సాధిస్తారు.
కుంభ రాశి: దగ్గరైన వ్యక్తిని కలుస్తారు. వారితో శృంగార క్షణాలను ఆస్వాదిస్తారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. రుచికరమైన ఆహారంతోపాటు మంచి దుస్తులను ధరిస్తారు. చాలా శక్తివంతంగా కనపడతారు.
మీన రాశి: ఆత్మవిశ్వాసం మెండు. దీనివల్ల పనిలో విజయం సాధిస్తారు. మాటల్లో, ప్రవర్తనలో కోపం ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.












Click it and Unblock the Notifications