దీపావళిరోజు రాశులవారు చేయాల్సిన పని
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని అమావాస్య రోజు దీపావళి పండగ జరుపుకుంటారు. ఇది ఐదురోజులు ఉంటుంది. నవంబర్ 10న ధన త్రయోదశితో మొదలై 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది వచ్చిన దివాళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాహువు, శని గ్రహాల స్థానాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక యోగాల శుభప్రభావం పడుతుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశులవారు దాన కార్యక్రమాలు చేయడం వల్ల ఊహించని ప్రయోజనాలు పొందుతారు. దీపావళి పండగ రోజు ఏయే రాశులవారు ఏయే వస్తువులను దానం చేయాలో తెలుసుకుందాం.
మేషరాశి : దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పంచదార దానం చేయాలి. ఈ రాశివారు పండగ రోజు ఎరుపు రంగు దుస్తులను ధరించడం మంచిది.

వృషభ రాశి : తెల్లని దుస్తులు ధరిస్తే మరిన్ని లాభాలు పొందుతారు. ప్రత్యేక పూజలు చేసిన ఆహార వస్తువులను దానం చేయడంవల్ల గ్రహాల చెడు ప్రభావం తొలగిపోతుంది.
మిథున రాశి : దీపావళి రోజు లాభదాయకంగా ఉంటుంది. బెల్లాన్ని దానం చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. క్రీమ్ కలర్స్ దుస్తులను ధరించాలి.
కర్కాటక రాశి : లక్ష్మీ పూజ తర్వాత అన్నం దానం చేయడం వల్ల జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి. మణి రంగుతో కూడిన దుస్తులను ధరించాలి.
సింహరాశి : వస్త్రదానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పండగ రోజు తెలుపు రంగు దుస్తులను దుస్తులను ధరించాలి.
కన్య రాశి:లక్ష్మీ పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు తీపి ఆహార పదార్థాలను దానంగా ఇచ్చి వీలైనంతా దక్షిణ ఇవ్వాల్సి ఉంటుంది. బూడిద రంగు దుస్తులు ధరించాలి.
తులా రాశి:పుస్తకాలను దానం చేయడం చాలా శుభప్రదమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి గులాబీ రంగు దుస్తులు ధరించాలి.
వృశ్చిక రాశి : పప్పు, బెల్లం దానం చేయడం మంచిది. మెరూన్ కలర్ దుస్తులను ధరించడం చాలా శుభప్రదం.
ధనుస్సు రాశి : ఇనుముతో తయారు చేసిన వస్తువులను దానం చేయాల్సి ఉంటుంది. గోధుమ రంగు దుస్తులు ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
మకరరాశి : లక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. కొత్తిమీరను దానం చేయడం చాలా శుభప్రదమని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. బ్రాహ్మణులకు భోజనం పెట్టించడం మంచిది.












Click it and Unblock the Notifications