ఏప్రిల్ నెల రాశిఫలాలు
ఏప్రిల్ నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మార్చబోతున్నాయి. ఏప్రిల్ 22న గురుడి సంచారం ఉంటుంది. బుధుడు మేషంలోనే అస్తమించనున్నాడు. మేషం, మిధునంతో సహా అనేక రాశిచక్రాల వారికి ఏప్రిల్ నెలలో ప్రయోజనకరంగా ఉంటుంది.
తులా రాశి (Libra)
ఈ రాశివారు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని ఇతరులపై నెల మధ్యలో వదిలేస్తారు. వేరేవారిపై అతిగా ఆధారపడతారు. ఇది తక్షణమే మానుకోవాలి. ప్రేమ జీవితం బాగుంది.

వృశ్చిక రాశి(Scorpio)..
ఈ నెల ప్రారంభం కష్టంగా సాగుతుంది. మీ సన్నిహితుల నుంచి ఆశించిన మద్దతు పొందలేరు. ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా ఈనెల రెండోవారంలో వ్యాపారవేత్తలు తమ పోటీదారుల నుంచి కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కోర్టుకు సంబంధించిన విషయాల్లో ఉపశమనం లభిస్తుంది.
ధనస్సు రాశి (Sagittarius)
పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులు తమ పోటీదారుల నుంచి కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటారు. అధికంగా ఉత్సాహంగా ఉండటం మానుకోవాలి.
మకర రాశి(Capricorn)
వీరికి ఈనెల అంతా శుభప్రదంగా ఉంటుంది. అడ్డంకులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయ వనరులు దొరుకుతాయి. ప్రాణ స్నేహితులతో ఎక్కువ సమయం వెచ్చిస్తారు. నెల మధ్యలో దూర ప్రయాణాలు చేస్తారు.
కుంభ రాశి(Aquarius)
వీరికి కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. జాగ్రత్త లేకపోతే ప్రమాదాలకు గురవుతారు. వ్యాపారస్తులకు ఈనెల మధ్యలో లాభాలొస్తాయి. మీ ప్రేమ భాగస్వామితో అపార్థం ఏర్పడుతుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికను పట్టుదలగా అమలు చేస్తారు.
మీన రాశి(Pisces)
వీరికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఈ నెలలో ప్రతి క్షణాన్ని ఎంతో ఆలోచనాత్మకంగా గడపాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీకు పెద్ద పెద్ద విజయాలు వస్తాయి. ఉద్యోగాలు మారాలనుకునేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కోరుకున్న ప్రాంతానికి బదిలీ జరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications