వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: హైబీపీని కంట్రోల్ చెయ్యటానికి మర్చిపోకుండా ఈ ఆహారపదార్ధాలు ట్రై చెయ్యండి!!

|
Google Oneindia TeluguNews

అధిక రక్తపోటు.. ఇప్పుడు దేశంలో సగానికి పైగా మంది ఈ హైబీపీతో బాధపడుతున్నారు. మనం తీసుకునే ఆహారం, మన జీవన విధానం, విపరీతమైన పని ఒత్తిడి వెరసి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హైబీపీతో బాధ పడుతున్నారు. హైబీపీ కారణంగా గుండె జబ్బులు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి అనేక ఇతర ప్రమాదాలు ప్రాణాలకే ముప్పు తెస్తాయి. ఇక హైబీపీని తగ్గించుకుని నార్మల్ గా ఉంచుకోకుంటే మీ ఆరోగ్యం డేంజర్ జోన్ లో ఉన్నట్టే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హైబీపీ ఉన్నవారు ఆహారం విషయంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

హైబీపీ ఉన్నవారు ఆహారం విషయంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

అధిక రక్తపోటుతో బాధపడేవారు జీవనశైలిని కచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే హైబీపీని కంట్రోల్లో పెట్టుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. విపరీతంగా ఉప్పు, విపరీతంగా కారం, మసాలా ఫుడ్ తినేవారిలో హై బీపీ ఎక్కువగా ఉంటుందని దానిని తగ్గించుకోవడానికి తినే ఆహారంలో ఉప్పు, కారం తగ్గించాలని సూచిస్తున్నారు. అంతేకాదు హైబీపీ ఉన్నవారు ఆహారనియమాలను తప్పనిసరిగా పాటించాలని, కొన్నిరకాల ఆహార పదార్థాలు మన బీపీని నియంత్రణలో ఉంచుతాయి అని చెబుతున్నారు. ఇక అటువంటి ఆహార పదార్థాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

హైబీపీ తగ్గించటంలో కీలక భూమిక పోషించే ఆహార పదార్ధాలు ఇవే

హైబీపీ తగ్గించటంలో కీలక భూమిక పోషించే ఆహార పదార్ధాలు ఇవే

హైబీపీని తగ్గించడంలో కొన్ని రకాల ఆహార పదార్ధాలు కీలక భూమిక పోషిస్తాయి. ముఖ్యంగా బీపీ ని కంట్రోల్ చేసుకోవాలనుకునే వారు తమ ఆహారంలో అరటి పండ్లు, కివి, పెరుగు, బీట్ రూట్, అవకాడో, బ్లూ బెర్రీ, వెల్లుల్లి, పాలకూర, టమాట, సాల్మన్ చేప, వైట్ బీన్స్, తేనె, బత్తాయిలు, కమలాలు, నారింజ పండ్లు, ఓట్స్ తీసుకోవడం ఎంతో మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తపోటును నియంత్రించడం కోసం అరటి పండు తినడం ఎంతో మంచిదని చెబుతున్నారు. అరటి పండులో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది అని చెబుతున్నారు.

రోజూ క్రమం తప్పకుండా ఇవి తినండి

రోజూ క్రమం తప్పకుండా ఇవి తినండి

ఇక రక్త పోటు ను తగ్గించుకోవడానికి ఆరెంజ్ ఆహారంలో చేర్చుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. దీనిలో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇది రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు పుచ్చకాయలు, ఆప్రికాట్లు తదితరాలను తీసుకోవడం కూడా మంచిదని సూచిస్తున్నారు. ఇక రోజూ క్రమం తప్పకుండా ఒక టమాటా తిన్నా, రెండు వెల్లుల్లి రెబ్బలు తిన్నా బీపీ కంట్రోల్ లోకి వస్తుందని చెప్తున్నారు.

బీపీ అదుపులో ఉంచుకోవాలంటే బీట్ రూట్, ఓట్స్ తినండి

బీపీ అదుపులో ఉంచుకోవాలంటే బీట్ రూట్, ఓట్స్ తినండి


బీట్ రూట్ తీసుకోవడం వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుంది అని చెబుతున్నారు. బీట్ రూట్ లో నైట్రేట్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్త ప్రసరణను మెరుగు చేస్తుందని చెబుతున్నారు. ప్రతిరోజు ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే ఎంతో మంచిదని సలహా ఇస్తున్నారు. బీపీని అదుపులో తెచ్చుకోవాలంటే ఓట్స్ తినడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఓట్స్ లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఇది సిస్టోలిక్, డయస్టోలిక్ రక్తపోటును నియంత్రణలో ఉంచుతుందని సూచిస్తున్నారు. హైబీపీ తో బాధ పడుతున్నారు ఎలాంటి ఆహారం తీసుకుంటే బీపి కంట్రోల్ లో ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించి తదనుగుణంగా ఆహార నియమాలు పాటిస్తే బీపీని నియంత్రించుకోవచ్చని సూచిస్తున్నారు.


disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Medical experts suggest that those who want to control high blood pressure should include banana, kiwi, yogurt, beet root, avocado, blue berry, garlic, lettuce, tomato, salmon fish, white beans, honey, oranges and oats in their diet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X