Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలి?: అమ్మవారికి కోపం తెప్పించకూడదు!

ఆ ధనం ద్వారా కీర్తి, సుఖాలు, సంతోషము ఎన్నోకలుగుతాయి. అలాంటి ధనాన్నిసంపాదించటం ద్వారా భూమిపై స్వర్గసుఖాలను అనుభవించగలరు.

మనము చేసే పొరపాటు వల్ల లక్ష్మీదేవి తొలగిపోతుంది. మన మంచివలననే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.అనారోగ్యం కలిగితే ఆ ధనం వుంటేనే వైద్యుడు వస్తాడు. ఆ ధనముంటేనే పిల్లలు గౌరవిస్తారు. ఆ ధనముంటేనే మీకు న్యాయపరమైన న్యాయము అందుతుంది.

ఆ ధనం ద్వారా కీర్తి, సుఖాలు, సంతోషము ఎన్నోకలుగుతాయి. అలాంటి ధనాన్నిసంపాదించటం ద్వారా భూమిపై స్వర్గసుఖాలను అనుభవించగలరు. అన్ని సుఖాలనిచ్చే ధనంలో పదిపైసలు కూడా వృధాగా పోకుండా చూసుకోవాలి. పదిపైసలే గదా అని అనుకుంటే..? అంత బ్యారేజీకి చిన్న రంధ్రమే కదా అని వదిలేస్తే ఏమవుతుందో అదే అవుతుంది.

విజయరహస్యం గుప్పిట వినూత్న దారిలో మీరెళ్ళి విజయం సాధించారు. తద్వారా ధనాన్ని పొందారు. ఉత్సాహం కొద్ది గానీ, గర్వంగా గానీ ఆ విషయం అవతలవారికి చెబితే ఆపై మీకు వచ్చేది సున్నానే. వారంతా మీరేర్పరచిన దారిలో సునాయాసంగా వెళ్లి ఎవరిస్థాయికి తగ్గట్టు వారు సంపాదిస్తారు.

Dealing anger toward lakshmi devi

ఇంకా పాడు చేస్తారు. ఎవరికీ ఆదాయం రాకుండా చేస్తారు. విజయరహస్యాన్ని చెప్పటం వల్ల నష్టం శ్రీకృష్ణుడే మా అసలు సిసలు బలమని పాండవులు అందరికీ చెప్పి వుంటే భారతగాథ మరోలా వుండేది.
మీ వృత్తికి సంబంధించిన మెటీరియల్ నే తీసుకోండి. వాడు ఫోన్ చేయగానే పంపుతున్నాడుగా, అప్పిస్తున్నాడుగా, ఇలా అనుకునే వ్యాపారం చేస్తుంటే, కొనే విషయంలో మీరు నష్టపోతున్నట్టే.

ఎవరూ ఊరికే అప్ప ఇవ్వరు. డబ్బులిస్తే తీసుకునే వడ్డీకి మూడురెట్లు వేసి, అదీ కొంత నాశిరకం అంటగడతారు. ఎంతసేపటికీ అమ్మటం విషయాల్లో లాభం గూర్చి ఆలోచించే వారు కొనే విషయాల్లో ఇరవైశాతం నష్టపోతున్నారని చాలా మందికి తెలీదు. చాలా చిన్న విషయం అనుకుంటారు.

ఇంట్లో ఆడవాళ్ళని అడగండి. బైట బండిలో కొనే కూరల ధరలకన్నా మార్కెట్లో కొనే కూరగాయల విషయంలో రోజుకి పదిరూపాయలు తేడా వస్తుందని మార్కెట్ కెళ్ళి కొంటారు. ఆ రకంగా రోజుకి పది.ఇంకా అనేక విషయాలు. అన్నీ కలిపితే ఎంత.ఇప్పటివరకూ ఎంత. అలాంటిది లక్షల్లో కొనుగోలు చేసే మీ కొనుగోళ్ళల్లో?

ఒకే ఒక మదమే సర్వసంపదలనీ, సుఖాలనీ నాశనం చేస్తుంది

=అహంకార మదం, ధనమదం, కామమదం, ఆవేశమదం అలా సకల మదాల వల్లే ధనం కోల్పోవాల్సి వస్తుంది. ఆ సకల మదాలు పట్టేది ఒకే ఒక్కదాన్నుంచి. అన్నం నుంచి అన్నమదం పడుతుంది. అనగా అతిగా తినటం వల్ల, ఆకలంటే తెలీకపోవటం వల్ల, వుంది కదాని పీకల దాకా తింటే కోల్పోయేది మీ సుఖాలనీ, తద్వారా వచ్చే అనారోగ్యాలూ ఇంకా ధనాన్ని కూడా.

Recommended Video

    కొన్ని ఇవ్వద్దు ఆవేశంలోనో, తొందరలోనో ఆ రేటు కిచ్చేస్తాననో, లేదా ఆ సమయానికి ఆ రేటుకి ఇస్తాననో మీరు కమిట్ అవ్వవదు. అలా తొందరపడ్డారో ఆపై ఆలోచించుకుంటే అంతా నష్టమే వస్తుంది. దాంతో అప్సెట్ అవ్వాల్సి వస్తుంది. వ్యాపారంలో, వ్యవహారంలో తొందరగా నిర్ణయం తీసుకోటము లాభమే.

    కానీ తొందరగా నిర్ణయం తీసుకున్నాడని అవతలవారికి అనిపించాలి. అవతల వారిని తక్కువగా అంచనా వేసి మాట ఇవ్వటం ఒక్కోసారి అసలుకే మోసం వస్తుంది. ఏం కావాలో ఎంతకావాలో చెప్పండి అని హరిశ్చంద్రుడు తొందరపడి మాట ఇచ్చినందుకే విశ్వామిత్రుడికి సమస్త రాజ్యమూ వదలి భార్యాపత్రులతో ఆ మహర్షి వెంట నడవాల్సి వచ్చింది. తనతో పాటు ఆలినీ, బిడ్డనీ అమ్ముకోవాల్సి వచ్చింది. పడరాని కష్టాలు పడాల్సి వచ్చింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+