2026లో తొలి చంద్రగ్రహణం. ఈ ఏడాది మొత్త ఎన్ని గ్రహణాలు?

కొత్త ఏడాది 2026 ప్రారంభమవడంతో గ్రహణాలపై ఆసక్తి నెలకొంది. ఖగోళ శాస్త్రం ప్రకారం సహజమైన సంఘటనలైన గ్రహణాలు... జ్యోతిష, సంప్రదాయాల పరంగా కూడా ప్రజల్లో ప్రత్యేక చర్చకు దారి తీస్తుంటాయి. ఈ నేపథ్యంలో 2026లో ఎన్ని గ్రహణాలు సంభవించనున్నాయి? వాటిలో బాగా ప్రాధాన్యం ఉన్న గ్రహణం ఏది? అన్న వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఖగోళ నిపుణుల సమాచారం ప్రకారం, 2026 సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి. అయితే సూర్యగ్రహణాలు రెండూ భారతదేశంలో కనిపించవు. చంద్రగ్రహణాల్లో మాత్రం ఒకటి మాత్రమే భారత్‌లో దర్శనమివ్వనుంది.

Lunar Eclipse on Holi 2026 Rare Celestial Event Visible in India on March 3

అందులోనూ మార్చి 3, 2026న ఏర్పడే చంద్రగ్రహణం అత్యంత ప్రత్యేకమైనదిగా ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే అదే రోజు హోలీ. పౌర్ణమి రోజున ఏర్పడే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపించనుందని సమాచారం.

ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.47 గంటలకు ముగుస్తుంది. మొత్తం వ్యవధి సుమారు 1 గంట 31 నిమిషాలుగా ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు సింహరాశిలో కేతువుతో కలిసి ఉండగా, రాహువు పూర్తి దృష్టి చంద్రుడిపై ఉండటం వల్ల చంద్రుడు ఎర్రటి వర్ణంలో కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది అరుదైన ఖగోళ సంఘటనగా పేర్కొంటున్నారు.

ఈ గ్రహణం భారత్‌లో కనిపించనుండటంతో సూతక్ కాలం కూడా చెల్లుతుంది. సంప్రదాయం ప్రకారం గ్రహణానికి 9 గంటల ముందే సూతక్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆహారం తీసుకోకపోవడం, దేవాలయాలను మూసివేయడం, మంత్ర జపం, ధ్యానం చేయడం వంటి ఆచారాలు పాటిస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత పవిత్ర స్నానం చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాల్లో కూడా కనిపించనుంది. భారత్‌లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, నాగాలాండ్, మిజోరం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ వంటి తూర్పు రాష్ట్రాల్లో గ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో గ్రహణం చివరి దశ మాత్రమే కనిపించే అవకాశం ఉంది.

గ్రహణాలకు సంబంధించిన జ్యోతిష, మతపరమైన అంశాలు ప్రజల నమ్మకాలపై ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమేనని, వాటిని ఎంతవరకు విశ్వసించాలన్నది వ్యక్తిగత నిర్ణయమేనని స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+