Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హేవలంబి నామ సంవత్సరం: కన్యా రాశి ఫలాలు

హేవలంబి ఉగాది నామ సంవత్సరంలో ఏ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనే వివరాలను ప్రముఖ జ్యోతిష్కుడు వన్ ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా అందించారు.

కన్య రాశివారు (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త 4 పాదాలూ, చిత్త 1,2 పాదాలు)

ఆదాయం - 5 వ్యయం - 5 రాజ్యపూజ్యం - 5 అవమానం - 2

గురుడు సెప్టెంబర్‌ వరకు కన్యలో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఈ దశ మీకు చెడు ఫలితములను ఇస్తుంది. ఈ సమయములో ఏ విధమైన అనారోగ్యము రాకుండా తగు జాగ్రత్త అవసరము. ఆరోగ్యానికి ముప్పు వచ్చే పనులు చేయరాదు. అనవసరపు ఖర్చుల వలన ధనవ్యయం సంభవిస్తుంది. దూర ప్రయాణాలను రదు చేసుకొనుట మంచిది, లేనిచో ఆశించిన ఫలితములు దక్కవు. పైగా ఇబ్బందులకు గురి కాగలరు. స్వగ్రామమునకు దూరముగా నివసించవలసి ఉంటుంది. నిరుద్యోగులకు నిరుత్సాహమే మిగులుతుంది. వృత్తి వ్యవహారములలో ఉన్న వారికి కూడా కష్టకాలము, పై అధికారులతో వాదోపవాదములకు దిగవద్దు. దీని వలన మానసిక శాంతి ఉండదు. కావున, తలపెట్టిన పనుల యందు మరింత శ్రద్ధ వహించినా అనుకున్న కాలములో అనుకున్న పనులు నెరవేరును. చేస్తున్న ఉద్యోగము పోవుటకు అవకాశము ఉన్నది.

ప్రభుత్వము నుండి ఒత్తిడి, కావున చేయు పనులందు జాగ్రత్త అవసరము. గృహమునందు కూడా ఎవరితోను వాదోపవాదములకు దిగకుండ, శాంతిగా ఉండుటకు ప్రయత్నించాలి. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. నిర్ణయములు తీసుకున్నపుడు జాగ్రత్తగా ఆలోచించాలి. మనో నిబ్బరముతో మెలగాలి, లేదా మానసిక వ్యధతో బాధ పడతారు. కొందరు పాత సమస్యల నుండి ముక్తులు అవుతారు. సంతానము అభివృద్ధి జరుగుతుంది, దైవకార్యములపై శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్ధులకు మంచి కాలము, సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

The Raasi Phalas of Hevalambi kanyarasi

11 సెప్టెంబర్‌ నుండి గురుడి తులలో సంచరించుట వలన. మంచి సమయము, అన్నింటా జయము, ధన లాభము, వృత్తి వ్యవహారములు, వ్యవసాయము కలసి వచ్చును. తద్వారా దానధర్మములు చేస్తారు. స్థలమును కొనుగోలు చేస్తారు లేదా పాత బాకీలు తీరుస్తారు. గృహమునందు సంతోషము, వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, వృత్తి వ్యవహారాలలో పైఅధికారుల అనుగ్రహము పొంది మిగతా వారికి ఆదర్శప్రాయువులు అవుతారు. శత్రుహాని, సంఘములో ఉన్నత స్థాయి, గౌరవ మర్యాదలు ప్రాప్తించును. మనస్సున శాంతి, తద్వారా మంచి బుద్ధితో ఆలోచన కలుగుతుంది.

శని 07 ఏప్రిల్‌ నుండి ధనులో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. జాగ్రత్త అవసరము. ఆర్థిక పరముగా మంచిది కాదు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. వృత్తి వ్యవహారములందు ఆసక్తి, ఉత్సాహము తగును. వృత్తిని ఇష్టపడక పోవుటచే పైఅధికారుల వలన మాటలు పడుదురు. కొంతమందికి ఉద్యోగములో వేరే చోటికి బదిలీలు జరుగును. సంఘములో మంచిగా ప్రవర్తించుటకు ప్రయత్నించగలరు, ప్రతి పనియందు నిదానము అవసరము. శారీరక శ్రద్ధ అవసరము. ఉదరకోశ సంబంధ వ్యాధులు కలుగును.

శని21 జూన్‌ వృశ్చిక సంచారం వలన, ఈ దశ మీకు మంచి కాలము, ఆర్థికముగా బాగుండును. ధనము చాలా విధాలుగా లభిస్తుంది. ఏ పని తలపెట్టినా కలసి వచ్చును. వ్యవసాయదార్లకు, కోళ్ల పెంపకము వర్తకులకు అనుకూల సమయము, ధనార్ధన కలుగవచ్చును. మీతో కొందరు స్థిరాస్టి కొనుగోలు చేయుదురు. మొత్తం మీద ఆర్థిక పరముగా మంచి కాలము. నిరుద్యోగులకు మంచి ఉద్యోగవకాశములు కలుగును. ఉద్యోగస్తులకు పై పదవులు, జీతము పెరుగుదల, ఉన్నత స్థాయి పొందుదురు. మీ పనిని, శ్రద్ధని, చురుకుతనమును గుర్తిస్తారు. సంఘములో మంచి పేరు సంపాదించు కొనగలరు. మీలో కొంత మంది తమ కింద పనులు చేయుటకు సేవకులను నియమించెదరు. మీకు వాక్చాతుర్యమును పొందగలరు. ఆరోగ్య లాభము, ఉత్సాహముగా ఉందురు. ఆనందముగా ఉందురు. గృహములో సుఖశాంతులు, వైవాహిక జీవితము సుఖముగా ఉండును. సోదర వర్గము, సంతానము మీకు చేదోడుగా ఉందురు. మీపట్ల ఇతరులకిగల విరోధాలు నశించి, మంచి కాలము కలసి వచ్చును. ప్రయాణములు సంభవించును.

శని అక్టోబర్‌ 25నుండి ధనూరాశి సంచారం వలన. . ప్రాణభీతి, భయము, మనోవేదన, ఆతృత కలుగును. తప్పుడు పనులు చేయుటకు అవకాశము కలదు. శత్రువులతో విరోధము తగదు. స్నేహితులు, అయిన వారు దూరమగుటకు అవకాశము ఉండవచ్చును. గృహములోను భార్యా, పిల్లల ఆరోగ్య భంగములు, గృహములో అయిన వారికి మరణము సంభవించవచ్చును. అయిన వారితో విభేధాలు పనికి రావు. బంధువర్గములో మరియు గృహములో శత్రుత్వము పెరుగును. శత్రువులకు దూరముగా ఉండుట మంచిది. కొందరికి సంతాన అవకాశము కూడా ఈ దశలో కలుగవచ్చును.
ఆగస్ట్‌ 18 వరకు రాహువు సింహరాశి సంచారం వలన, ఈ దశ ఇబ్బందైన దశ, వృత్తి వ్యవహారములలో నష్టము వాటిలును. ఎంతపని చేసినను అనుకున్న ఫలితాలు దక్కవు. ఇంతకు మునుపు చేపట్టిన పనులలో కూడా ఆటంకములు ఎదురు అగును. వృత్తి వ్యవహారములలో మనో నిబ్బరము, ధైర్యము అవసరము. మితముగా ఖర్చులు చేయడము మంచిది. లేదా ఋణ బాధలకు గురి కావచ్చును. ఆఖరికి స్థిరాస్థిని వదులు కోవలసి వచ్చును. స్థాన చలనమునకు కూడా అవకాశము ఉండవచ్చును.

కేతువు షష్ఠమమునందు ప్రవేశము:- ఈ దశ మీకు మంచి కాలమును తెచ్చును. వ్యాపారస్తులకు మంచి కాలము. వ్యాపారములు కలసివచ్చును. వ్యవసాయదార్లకు, పశువులు కాయువారికి వారి రంగములలో ఆర్థిక లాభము సంభవించే అవకాశము ఉండవచ్చును. ఆర్థికముగా బాగుండును. వేరే వారికి ఋణములు ఇచ్చుట వలన ధన లాభము, ఆదర్శవంతులుగా అందరి వద్ద ఉండి ధనలాభము పొందుదురు. జయము సంభవించవచ్చును.

ఆగస్ట్‌ 18 నుండి రాహువు కర్కాటకరాశి సంచారం వలన, ఈ దశ మంచి కాలము. ఆర్ధికముగా బాగుండును. అనుకోని విధముగా ధన లాభము, అన్ని చోట్ల నుండి లభించును. విదేశీ ప్రయాణముల వలన, సముద్ర వ్యాపారముల నుండి ధన లాభము, ఈ కాలంలో స్థిరాస్తి మరియు ఆభరణాలు కొందురు. ఇంట్లో పరిస్థితి బాగుండును. రుచికరమైన వంటలు, ఇంట్లో చేస్తారు. భాగస్వామి ఆరోగ్యము కుదుట పడును. పెళ్లికాని పిల్లలు ఉన్నట్టెతే సంబంధాలు కుదురుతాయి.

కేతువు పంచమమునందు ప్రవేశము:- ఈ దశ మిమ్మల్ని జీవితములో ఒడుదుడుకులను తెస్తుంది. చేతిలోనికి సొమ్ము వచ్చినట వచ్చి మాయమగును. విపరీతమైన అనవసరపు ఖర్చులు చేయుట సంభవము. సంతానము వలన కూడా విపరీత ఖర్చులు, మీలో కొందరు అనుకోని విధముగా ధనలాభము, ఋణములు చేయరాదు. చంద్రుని ప్రభావముచే ඩීදාළු ఆరోగ్యము మిమ్మల్ని కలవరపెడుతుండది. పిల్లల ఆరోగ్యముపై అశ్రద్ధ వలదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+