డిసెంబరు 31 వరకు ఈ రాశులవారికి తిరుగులేదు.. మహారాజులే
జ్యోతిష్యం ప్రకారం గురువు గమనంలో మార్పు వచ్చినప్పుడు ఆ ప్రభావం భూమితోపాటు మానవుల వ్యక్తిగత జీవితాలపై కూడా ఉంటుంది. విద్య, సంతానం, ఆధ్యాత్మికతకు కారకుడైన బృహస్పతి ఈరోజు సాయంత్రం 4.58 గంటలకు మేషరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. డిసెంబరు 31వ తేదీ వరకు అక్కడే ఉండే గురుడివల్ల కొన్ని రాశులవారికి బాగా కలిసి వస్తుంది. ఆ వివరాలను తెలుసుకుందాం.
మేష రాశి : వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది కొత్త శక్తిని కలిగిస్తుంది. ఏ పనిని ప్రారంభించినా మంచి ప్రయోజనాలను పొందుతారు. గురువు 9, 12 ఇంటికి అధిపతి. పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు. వ్యాపారం చేసేవారికి చాలా బాగుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి వస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇదే మంచి సమయం. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల కల నెరవేరుతుంది.

సింహ రాశి : బృహస్పతి రివర్స్ కదలిక వీరికి కలిసి వస్తుంది. సంచార జాతకంలో తొమ్మిదో ఇంట్లో రివర్స్‌లో కదలబోతున్నాడు. అదృష్టం వీరి వైపు ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో కూడిన ప్రమోషన్ లభిస్తుంది. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ఎంతో జాగ్తత్తగా ఉండాలి. ఈ సమయం కలిసి వస్తుంది. కుటుంబంలో కొన్ని మతపరమైన లేదా శుభ కార్యక్రమాలు జరుగుతాయి.
తుల రాశి: జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ధైర్యం పెరుగుతుంది. భాగస్వామిగా ఉన్న పనిలో గెలుపొందుతారు.
కుంభ రాశి : ఉద్యోగం మారాలనుకునేవారికి మంచి సమయం. సంతానం కలుగుతుంది. డబ్బు దుబారా చేయడం మానుకోవాలి. పసుపు రంగు దుస్తులు ధరిస్తే మేలు కలుగుతుంది. పెళ్లికానివారికి వివాహ అవకాశాలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం మీదే. భాగస్వామిగా ఉన్న పనిలో విజయం సాధిస్తారు.












Click it and Unblock the Notifications