Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుంభ రాశి ఫలాలు 2017 సంవత్సరానికి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం

ధనిష్ట 3,4 పాదములు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదములు మీ పేరులో మొదటి అక్షరము. గూ, గే, గో, సా, సీ, సు, సే, సో, దా అను అక్షరములలో ఒకటి అయినచో మీది కుంభరాశి.

ధనిష్ట 3,4 పాదములు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదములు మీ పేరులో మొదటి అక్షరము. గూ, గే, గో, సా, సీ, సు, సే, సో, దా అను అక్షరములలో ఒకటి అయినచో మీది కుంభరాశి.

Aquarius Horoscope

1) 2017 జనవరి:

షష్ఠ స్థాన స్థితి దోషఫలదము. వ్యాధి కలుగుతుంది, బంధువులతో కలహము ఏర్పడుతుంది, గృహములో శుభప్రశంసలు, వివాహాది శుభకార్యములు నెరవేరుట, బంధు మిత్ర సమాగమము, అధికారానుగ్రహం, నూతన వ్యక్తుల వలన స్నేహలాభములు, ధనలాభము, పాతబాకీలు వసూలగుట, సంఘములో గౌరవము, పలుకుబడి, వ్యాపారాభివృద్ధి, వృత్తిలో నైపుణ్యము సాధించుట, ధనలాభం, కుటుంబ సౌఖ్యము, దైవకార్యములలో పాల్గొనుట, పుణ్యక్షేత్ర సందర్శనములు.

2) ఫిబ్రవరి:

మనసులో అతురత కలుగుతుంది, అధికమైన ఖర్చులుచేస్తారు, భయము కలుగుతుంది, సంసారసౌఖ్యం లోపిస్తుంది, అనవరసమైన శ్రమ చేస్తారు. తలంచిన కార్యములు జయము; చేయకృషి వృద్ధిగా వుండుట, స్థిరాస్తులు కలిసివచ్చుట, వ్యాపారలాభం, లోన్ల శాంక్షను అవుట, స్పెక్యులేషనులో రాణించుట, కొరుకుడుపడని వ్యవహారములు పరిష్కారమగుట, జాయింటుదారులతో మనస్పర్థలు, తిండి - నిద్ర సరిగా లేకపోవుట, అనారోగ్యం, సంగీత సాహిత్యములు - కళలయందు ఆసక్తి, సభలకు వెళ్ళట, మధుర పదార్ధములు భుజించుట.

3) మార్చి:

అర్ధాష్టమ శనిగా దోష ఫలదుడు. అనారోగ్యము కలుగుతుంది, మిత్రులను కోల్పోతారు, ధన నష్టము, భీతి కలుగుతుంది, అన్నదమ్ములు - అప్పచెల్లెంద్రతో విరోధములు, మాటామాటా, పట్టింపులు, మనస్సుకు స్థిమితము లేకపోవుట, బంధుమిత్రులతో విరోధములు, భయాందోళనలు, వివాహముకాని స్త్రీ - పురుషులకు సమస్యలు, ఆలస్యముగా పనులు నెరవేరుట, కుటుంబ సమస్యలు, ఏదో రూపేణా డబ్బు ఖర్చు అగుచుండుట, ప్రయాణములు చేయునపుడు వస్తువులను పోగొట్టుకొనుట, మర్చిపోవుట జరుగును.

4) ఏప్రియల్:

మనఃక్లేశము ఏర్పడుతుంది, ఉన్నచోటు నుండి బ్రంశము ఏర్పడుతుంది, కళత్ర బంధు నష్టము, వాత వ్యాధులు కలుగుతాయి, నూతన వస్తు వస్రాభరణ ప్రాప్తి, వాహనములు కొనుట, చేయు వృత్తి - వ్యాపారములలో అభివృద్ధి చెందుట, ధనలాభం, వివాహాది శుభకార్యములు కలిసివచ్చుట, అధికారానుగ్రహం, ఉద్యోగాభివృద్ధి, బంధుమిత్రులు కలియుట, సహాయ సహకారములు లభించుట, కుటుంబములో సుఖసౌఖ్యములు చేకూరుట, మనస్సుకు ప్రశాంతత.

5) మే:

బాధలు కలుగుతాయి, వృధా ప్రయాణములు చేస్తారు, శారీరక పుష్టితగ్గుతంది, మరెన్నో వ్యతిరేక ఫలితాలు కలుగును. సంగీత - సాహిత్యముల యందు ఆసక్తి, సభలు - సమావేశములలో పాల్గొనుట, మధుర పదార్ధములు భుజించుట, సమయమునకు సొమ్ము సరిగా అందకపోవుట, ఆర్థిక యిబ్బందులు, గృహ నిర్మాణాది కార్యక్రమములు, మార్పులు చేర్పులు చేయుట, విందు వినోదములలో పాల్గొనుట, కొన్ని విషయములలో యిబ్బంది పడుట.

6) జూన్:

శనికి ఇది అనుకూల స్థానము. స్త్రీ సంభోగము పొందుతారు, మనసులో సుఖభావన పొందుతారు, చంచల మనస్సు, మనోవిచారం, వివాహాది శుభకార్యములు చూచుట, విందు భోజనములు చేయుట, పెండింగు పనులు పూర్తి చేయుట, ఖర్చులు పెరిగినా నిలద్రోక్కుకొనుట, అందరినీ ఆకట్టుకొనుట, తలంచిన కార్యములు జయము, వ్యవహార జయం, తరచు ప్రయాణములు, ఒకే పనికి ఎక్కువసార్లు తిరుగుట, శ్రమ, అలసట,

7) జులై:

స్వంతబుద్ధిచే ప్రయత్నించిన కార్యములు సిద్ధించును, స్వంతచోట్ల గమనము, ఆరోగ్యము పొందుతారు, స్థిరాస్థి విషయంలో పేచీలు, సరిహద్దు తగాదాలు, సంతాన కుటుంబవృద్ధి, అధికారులతో వివాదములు, వ్యాపార వ్యవహారములలో ఆదాయాభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగావకాశములు, ఆదాయమునకు మించిన ఖర్చులు చేయుట, పశువులను, జంతువులను కొనుట వలన, అమ్ముటవలన లాభం లేకపోవుట, పశునష్టం.

8) ఆగష్టు:

బుద్ధి బలము పెరుగుతుంది, ధన లాభము కలుగుతుంది, విజయమువంటి అనేక శుభ ఫలములు కలుగును. భార్యకు అనారోగ్యం, సంతానమునకు పీడ, అధికారుల వలన భయం, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదములు, మనస్పర్ధలు, నమ్మినవారి వలన మోసములు, చేయు వృత్తి - వ్యాపారములలో సొమ్ము దఫదఫాలుగా వసూలగుట, మాట పట్టింపులు, విరోధములు, శరీరమందు అనారోగ్యం, ఉత్సాహము లేకపోవుట.

9) సెప్టెంబరు:

మిక్కిలి అనుకూల స్థానం. ఐశ్వర్యము పొందుతారు, ధనలాభము కలుగుతుంది, కొత్త స్నేహితులను కలుసుకొంటారు, అశుభవార్తలు వినుట, శతృవృద్ధి, తోబుట్టువులు, అధికారులతో విరోధములు, తలంచిన కార్యములకు ఆటంకములు, మనస్సుకు ఆందోళన, అపనిందలు, జ్ఞాతి విరోధము, శతృవృద్ధి, పెంపుడు జంతువుల వలన బాధలు, బలహీనత, తాపము, అవయవములకు నొప్పలు, ధన విషయంలో చికాకులు.

10) అక్టోబరు:

వ్యవహారం లేదా చేసే పనులలో అనుకూలత ఏర్పడుతుంది, సౌఖ్యము పొందుతారు, బంధు జనుల ప్రోత్సాహము పొందుతారు, శత్రువులు మిత్రులగుట, కష్టము మీద పనులు నెరవేరుట, మనోవిచారం, అనవసర ధనవ్యయం, ఏ పని చేసినా లాభనష్టములు సమానముగా నుండుట, తండ్రికి అనారోగ్యం, నూతన వ్యక్తులతో స్నేహము, ప్రయాణములకు ఆటంకములు, పాత బాకీలు వసూలగుట, నిరుత్సాహం, శారీరక బాధలు.

11) నవంబరు:

సజ్జనుల స్నేహము పొందుతారు, సంతానము కలలుగుటకు అవకాశం వుంది, రాజానుగ్రహము తలంచిన పనులు నెరవేరుట, అన్ని రంగములా అనుకూల వాతావరణ, రాజకీయ వ్యవహారములయందు జయము, వృత్తి - వ్యాపారములలో ఆర్థికాభివృద్ధి, ఉద్యోగప్రాప్తి, ఉద్యోగాభివృద్ధి, అకారణ కలహము వచ్చినా మధ్యవర్తులద్వారా పరిష్కారములు, తల్లిదండ్రులకు ఆనందం, దీర్ఘరోగములు కొంత నయమగును.

12) డిశంబరు:

పెద్దల అనుగ్రహం పొందుతారు, శుభ కార్యములు ఆచరించుట వంటి అనుకూల ఫలితములు, కలుగును. గృహములో వివాహాది శుభకార్యమలు నెరవేరుట, పాతబాకీలు, వసూలగుట, ధనలాభం, శరీర సౌఖ్యము, సంఘములో గౌరవము, పలుకుబడి, అధికారానుగ్రహం, భార్యాభర్తలు సఖ్యతగా వుండుట, పనులు చేయుటలో ఉత్సాహముతో ముందుకు పోగలుగుట, కార్యములను నెరవేర్చుకొనుట, విలాసవంతముగా జీవితమును గడుపుట జరుగును. కుంభరాశివారు గురునికి 16 వేలు జపం - శనగలు దానం, గోవును పూజించుట, ఆహారము పెట్టుట, దత్తాత్రేయుని, దక్షిణామూర్తిని, రాఘవేంద్ర స్వామిని ఆరాధించుట, విష్ణు సహస్రనామ స్తోత్రమును పఠించుట.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+