Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మేష రాశి వారికి 2017వ సంవత్సరం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం

అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, మీపేరులో మొదటి అక్షరము చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, అ అను అక్షరములలో ఒకటి అయినచో విూది మేషరాశి.

అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, మీపేరులో మొదటి అక్షరము చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, అ అను అక్షరములలో ఒకటి అయినచో విూది మేషరాశి.

Aries Horoscope

1) 2017 జనవరి:

ఎక్కువ శ్రమ చేస్తారు, రాజభయములేదా పై అధికారుల చేత, ప్రభుత్వంచేత భయం పొందుతారు, చేసే పనులలో ఆటంకములు కలుగుతాయి, అనవసర ధన వ్యయం, కష్టము విూద పనులు నెరవేరుట, నిరుత్సాహము, నూతన పరిచయములు, శతృవులు మిత్రులగుట, బంధుమిత్ర సమాగమము, చేయు వృత్తి-వ్యాపారముల యందు కలిసివచ్చుట, ధనలాభం, శాస్త్రసంబంధమైన విద్యలయందు, కళలయందు ఆసక్తి, క్రయవిక్రయలాభం.

2) ఫిబ్రవరి:

కష్టతరమైన నష్టప్రదమైన ప్రయాణాలు చేస్తారు, అరిష్టమకలుుగును, ధననష్టము జరుగుతుంది, గృహమునందు వివాహాది శుభకార్యములు నెరవేరుట, తలంచిన కార్యములు జయము, బాకీలు వసూలగుట, వ్యవహారములు మధ్యవర్తుల ద్వారా పరిష్కారమగుట, తల్లిదండ్రుల ఆదరణ, క్రయవిక్రయముల రీత్యా ధనలాభం,శతృవులు మిత్రులగుట, రాజకీయవ్యక్తుల వలన సహాయ సహకారములు, సుఖసంతోషములు, ఆరోగ్యము బాగుండును. మధ్య మధ్య దెబ్బలు, గాయములు తగులును. గౌరవం తగ్గుతుంది.

3) మార్చి:

దేహకాంతి తగ్గుతుంది, దొంగల వల్ల భయము కలుగుతుంది, కష్టనష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు స్థాన చలనములు, అపనిందలు, ఇంటా, బయటా గొడవలు, అనవసర ధనవ్యయం, మనస్సుకు స్థిమితము లేకపోవుట, జాయింటుదార్లతో మనస్పర్లలు, వేళకు సరిగా భోజనము చేయకపోవుట, అనారోగ్యం, శతృబాధలు, ఋణము చేయవలసివచ్చుట, శాస్త్ర సంబంధమైన విషయములందు ఆసక్తి కలుగుతుంది.

4) ఏప్రియల్:

శుభఫలదుడు. అనుకున్నపనులు సాధిస్తారు, కుటుంబంలో ఆనందం, సౌఖ్యము కలుగుతుంది, ధనలాభము కలుగుతుంది, మనస్తాపము, బంధు మిత్ర కలహములు, ఎంతసొమ్ము సంపాదించినా మనస్సుకు ప్రశాంతత లేకపోవుట, ధననష్టం, నూతన బాంధవ్యములు, బంధుమిత్ర సమాగమము, శుభకార్యములు జరుగుట, వ్యవహార చిక్కులు, పుణ్యకార్యములు, దైవకార్యములలో పాల్గొనుట, దీర్ఘరోగములతో బాధపడుచున్నవారికి ఊరట, కొంతనయంగా వుండును.

5) మే:

ఆరోగ్యము పొందుతారు, స్త్రీసౌఖ్యము కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, పెద్దలను నూతన వ్యక్తులు, గొప్పవారితో పరిచయములు, క్రయవిక్రయముల రీత్యాధనలాభం, సంగీత-సాహత్యాది కళలయందు ఆసక్తి కొత్తవాటిని తెలుసుకొనుట, నేర్చుకొనుట, జంతువులను కొనుటవలన, అమ్ముటవలన లాభించుట, శతృవులు మిత్రులగుట, స్త్రీ సౌఖ్యం, మనస్సు నిలకడగా వుండకపోవుట, చర్మవ్యాధులు, అనారోగ్యం, చిరుతిళ్ళు ఎక్కువగా తినుట, ధనవ్యయం.

6) జూన్:

గొప్పవారిని కలుసుకొంటారు, గౌరవము పొందుతారు, అలంకార వస్తువులు ప్రాప్తించును. భార్య, పిల్లల వలన సుఖసౌఖ్యములు, తల్లిదండ్రులు, పూర్వీకుల ఆస్టి కలియుట, సంఘములో గౌరవము, పలుకుబడి, తలంచిన కార్యములు నెరవేరుట, ఉద్యోగాదులలో అభివృద్ధి, వ్యవసాయదారులకు పంటలు ఫలించుట, ధనలాభం, విద్యార్థులకు విద్యాభివృద్ధి, తరచు ప్రయాణములు, ఆరోగ్యము బాగుండుట.

7) జూలై:

భాగ్య స్థానమందు శని సంచారము వ్యతిరేక ఫలితములు కల్పించును. దుఃఖము, శత్రుబాధ, భార్యాబిడ్డలకు కష్టములు, వృధా ప్రయాణములు, వ్యాధి, దారిద్య్రత, పితృ వర్గమునకు అరిష్టము, తలంచిన కార్యములు నెరవేరుట, తల్లిదండ్రుల ఆదరణను పొందుట, ధనలాభం, పేరుప్రతిష్టలు సంపాదించుట, నూతన వస్తు, వస్రాభరణప్రాప్తి, సంగీత-సాహిత్యముల యందు పాల్గొనుట, అధికారానుగ్రహం, వ్యాపార వ్యవహారముల యందు లాభం, తరచు ప్రయాణములు, అనవసర ధనవ్యయం, పనుల వత్తిడి వలన శరీరమునకు అలసట, అనారోగ్యం, మనశ్శాంతి లేకపోవుట.

8) ఆగష్టు:

కొన్ని సందర్భాలలో అల్ప సుఖము, ధర్మ విజ్ఞత వంటి స్వల్ప అనుకూల ఫలదము కలుగును. మనస్సునకు స్థిమితము లేకపోవుట, భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధములు, ఇతరులతో మాట్లాడుట వలన అపనిందలు, తలవంపులు, అకారణ కలహములు, రాబడికి మించిన ఖర్చులు, బంధువులలో ఆధిఖ్యత, వస్తువులు పోగొట్టుకొనుట, చోరభయం, అనారోగ్యం, మందులు వాడుట.

9) సెప్టెంబరు:

వాడుకున్న వస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు. రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానం చేయడం మంచిది. వివాహాది శుభకార్యములు నెరవేరుట, బంధుమిత్ర సమాగమము, ధనధాన్య సమృద్ధి, ఎంతసొమ్ముచేతికి వచ్చినా ధనము నిలపడకపోవుట, వ్యాపారాభివృద్ధి, పెంపుడు జంతువులు, పశువులు, సంతానము వలన చిక్కులు, విందు భోజనములు చేయుట, పలుకుబడి, గౌరవము కలుగును. ఆరోగ్యము బాగుండును.

10) అక్టోబరు:

రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారం వ్రతం పూజలు ఆలయ దర్శనాలు శుభకరం. అనుకున్న పనులు కష్టము విూద ఆలస్యముగా నెరవేరుట, భార్య, పిల్లలకు అనారోగ్యము, కొద్ది కొద్దిగా ధనము చేతికందుట, సంతాన కుటుంబ వృద్ధి, రహస్యాంగములకు సంబంధించిన బాధలు, అవయవములకు నొప్పులు, అధికారులవలన భయం, మాట పట్టింపులు, విరోధములు.

11) నవంబరు:

విఘ్నములు, వ్యాకులత, ఆదాయ నష్టం, కీర్తి భంగము, ఉద్యోగమందు బాధలు వంటి కష్టనష్టములు కలుగును. తక్కువ వారి వలన మాటలు పడుట, అధికారుల వలన చికాకులు, వృత్తి-వ్యాపారములలో ధనాదాయము బాగున్నా మనస్సుకు ఉత్సాహము లేకపోవుట, వేళకు సరిగా భోజనము చేయకపోవుట, ఆరోగ్యము బాగుండకపోవుట, నమ్మిన వారి వలన మోసములు, ఇంటి పట్టున సరిగా వుండకపోవుట, తరచు ప్రయాణములు.

12) డిశంబరు:

దశమ స్థాన శని సంచారము దోష ఫలదము, పాప కార్యాచరణ, వృత్తి నష్టము, కర్మ భ్రష్టత, పరితాపము, దుఃఖము, మానభంగము, పెండింగు వ్యవహారములు పరిష్కారమునకు వచ్చుట, శత్రువులు మిత్రులగుట, సంగీత సాహిత్యాది కళలయందు ఆసక్తి ఆధ్యాత్మిక భక్తి విహారయాత్రలకు వెళ్ళట, బాకీలు వసూలగుట, ధనము చేతికందుట, శతృవృద్ధి, అశుభవార్తలు వినుట, ఏ వృత్తి వ్యాపారస్తులకైనా లాభనష్టములు సమానము, జారిపడుట, వాహనప్రమాదములు, అనారోగ్యం, కొట్లాటలు, గాయములు, రక్తదర్శనం. . మేష రాశి వారు షష్ట గురుదోషపరిహారమునకు మాసశివరాత్రికి మరియు సోమవారం ఈశ్వరాభిషేకం, గురువారం శనగలు దానం, దత్తాత్రేయుని, రుణ విమోచనకు అంగారకుని (కుజుని), సంకష్టహర గణపతిని.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+