అయోధ్య రామ మందిరం, సీఎం ఏం చేస్తున్నారు, పాత కేసుల్లో ఎన్ని వందల మంది అంటే !
పెండింగ్‌లో ఉన్న కేసులను క్లియర్ చేయడానికి కర్ణాటకలోని ధారవాడ జిల్లాలో మూడు దశాబ్దాల క్రితం రామజన్మభూమి పోరాటంలో హిందూ కారసేవక్ లతో సహా వందలాది మందిని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. దీనికి కొనసాగింపా అని అర్థం వచ్చేలా కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 200 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చెయ్యడం ఇప్పుడు కలకలకం రేపింది.
కర్ణాటక రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో పోలీసులు గత ఆరు నెలల్లో చాలా మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితులు కోర్టుకు హాజరు కాకపోవడంతో పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోయాయని, ఆ కేసులు తగ్గించేందుకు పోలీసులు పావులు కదుపుతున్నారు. కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో అరెస్టులతో పాత కేసులు ఉన్న వాళ్లు హడలిపోతున్నారు

బెంగళూరులో 52 మంది, ధారవాడలో 36 మందితో సహా గత ఆరు నెలల్లో మొత్తం 200 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు కర్ణాటకకు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారని ప్రముఖ వార్త సంస్థ నివేదించింది. ఇటీవల హుబ్బళిలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన 31 ఏళ్ల తర్వాత హిందూ సంఘం నాయకుడు శ్రీకాంత్ పూజారి (60)ని అరెస్టు చేయడం కర్ణాటక వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ఉన్న వాళ్లను ఇలా అరెస్టు చెయ్యడం పోలీసుల పని అని కర్ణాటక హోమ్ శాఖ అంటోంది. శ్రీకాంత్ పూజారి అరెస్టును నిరసిస్తూ బీజేపీ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. హుబ్బళి- ధారవాడ జంటనగరాల్లో బీజేపీ కార్యకర్త శ్రీకాంత్ పూజారిని ఇన్ని ఏళ్ల తరువాత అరెస్టు చెయ్యడాన్ని బీజేపీతో సహ అనేక హిందూ సంఘ సంస్థలు తప్పుపట్టాయి.

అలాగే ఆ జంట నగరాల్లో 36 మందిని వివిధ కేసుల కింద అరెస్టు చేశారు. బీజేపీ నేతలు, హిందూ సంఘ సంస్థల కార్యకర్తలను ఉద్దేశ్యపూర్వకంగా అరెస్ట్ చేస్తున్నారని, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేష రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. అనంతరం రాజకీయ రంగు పులుముకుని నిరసనకు దిగారు. హిందూ సంఘం నాయకులను సిద్దరామయ్య ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని బీజేపీ నాయకులు ఆరోపించారు.












Click it and Unblock the Notifications