సింహ రాశి ఫలాలు 2017 సంవత్సరానికి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం
మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మీ పేరులో మొదటి అక్షరము మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే అను అక్షరములలో ఒకటి అయినచో మీది సింహరాశి.
మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మీ పేరులో మొదటి అక్షరము మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే అను అక్షరములలో ఒకటి అయినచో మీది సింహరాశి.

1) 2017 జనవరి:
ఉన్నచోటు నుండి వేరే చోటుకి వెళతారు, వృధా ప్రయాణములు చేస్తారు, మనస్సు నిలకడగానుండకపోవుట, భార్యాభర్తల మధ్య అభిప్రాయ " బేధములు, రాబడికి మించిన ఖర్చులు, బంధు మిత్రుల వలన ధనవ్యయం, ఇతరులతో మాట్లాడుట వలన అపనిందలు, స్త్రీలతో విరోధములు, సుఖసౌఖ్యములు లేకపోవుట, రహస్యాంగములకు సంబంధించిన బాధలు, అనారోగ్యం, ప్రాణభయం, దెబ్బలు తగులుట, ఎముకలు విరుగుట, పీడకలలు వచ్చుచుండును.
2) ఫిబ్రవరి:
దారిద్య్రత, దుఃఖము కలుగుతుంది, ధన నష్టము ఏర్పడుతుంది, తలంచిన కార్యములు జయము, చేయు కృషి వృద్ధిగా వుండుట, ఉద్యోగ వృతి - వ్యాపారములలో కలిసివచ్చుట, ధనలాభం, కుటుంబ సౌఖ్యము, నూతన వ్యాపార ప్రయత్నములు ఫలించుట, అధికారానుగ్రహం, ఉద్యోగాభివృద్ధి, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, బంధు మిత్ర సమాగమము, విందు భోజనములు, వినోద కార్యక్రమములలో పాల్గొనుట.
3) మార్చి:
ఆస్తి నష్టము కలుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది పుణ్యకార్యాలకు ఖర్చు పెడతారు. తలపెట్టిన కార్యములకు ప్రారంభములో చికాకులు, ఆటంకములు ఎదురైనా కష్టము విూద పనులు నెరవేరుట, పాతబాకీలు వసూలగుట, ధనలాభము, నమ్మిన వారి వలన మోసములు, దగాలుపొందుట, మాట పట్టింపులు, విరోధములు, భార్యకు, సంతానమునకు పీడ, కొద్ది కొద్దిగా ధనము చేతికందుట, వేళకు సరిగా భోజనము చేయకపోవుట, అనారోగ్యం.
4) ఏప్రియల్:
మిక్కిలి అనుకూల స్థానం. సర్వతోముఖాభివృద్ధి, శారీరక మానసిక బలము ఏర్పడుతుంది, అధికారుల వలన చికాకులు, తక్కువవారి వలన మాటలు పడుట, అశుభ వార్తలు వినుట, అన్నదమ్ముల మధ్య కలహములు, ఏ కార్యము తలపెట్టినా నెరవేరకపోవుట, నూతన వ్యక్తులతో స్నేహము, ప్రయాణములకు ఆటంకము, అనవసర ధనవ్యయం, ఎప్పడూ విచారముగా నుండుట, సుఖ సౌఖ్యములు లేకపోవుట.
5) మే:
శరీరంలో తేజస్సు పెరుగుతుంది, అన్నివిధాల జయము కలుగుతుంది, కుటుంబంలో అభివృద్ధి ఏర్పడుతుంది, చేయు వృత్తి వ్యాపారములలో లాభనష్టములు సమానముగా వుండుట, కష్టము మీద గవర్నమెంటు పనులు నెరవేరుట, తండ్రికి అనారోగ్యం, పాత బాకీలు వసూలగుట, ఏదో రూపేణా సౌమ్ము చేతికందుట, ధనలాభము, నూతన పరిచయములు, గృహ నిర్మాణాది కార్యక్రమములకు ఆటంకములు, నెమ్మదిగా పూర్తి అగుట.
6) జూన్:
సుఖము పొందుతారు, మంత్రసిద్ధి విశేషించి దేవతానుగ్రహం పొందుతారు, ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది, తలంచిన కార్యములు జయము, ఉద్యోగప్రాప్తి, అధికారుల వలన ఉపకార లాభములు పొందుట, వ్యాపారములలో కలిసివచ్చుట, పెండింగు వ్యవహారములు పరిష్కారమగుట, ప్రయాణలాభం, శతృవులు మిత్రులగుట, కళల యందు ఆసక్తి ధనలాభం, కుటుంబసౌఖ్యం, దీర్ఘరోగములతో బాధపడు వారికి ఆరోగ్యము చేకూరును.
7) జూలై:
గౌరము పొందుతారు, కీర్తి కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, నూతన ఉద్యోగ వ్యాపారములు ప్రాప్తించును. అధికారుల వలన పలుకుబడి, ప్రశంసలు పొందుట, ఉద్యోగప్రాప్తి, ధైర్యసాహసములతో కూడి వుండుట, భార్యాభర్తలు కలిసి మెలిసి వుండుట, విలువైన వస్తు వస్త్ర లాభం, గృహ జీవితానందము, వ్యాపారలాభం, ఎంత సొమ్మసంపాదించినా నిలపడకపోవుట,ధన వ్యయం, వేళకు భోజనము చేయకపోవుట, వైద్యము కొరకు ధనము ఖర్చు చేయుట, ఎత్తునుండి జారిపడుట, దెబ్బలు తగులుట.
8) ఆగష్టు:
భాగ్య స్థానమందు శని సంచారము వ్యతిరేక ఫలితములు కల్పించును. దుఃఖము, శత్రుబాధ, బంధు వర్గము వారితో విరోధములు, కంటికి, శిరస్సుకు సంబంధించిన బాధలు, మనస్సు నిలకడగా వుండకపోవుట, స్థాన చలనములు, దుష్ట సహవాసములు, చెడు వ్యసనములకు లోనవుట, అనవసర ధనవ్యయం, తరచు కలహములు, క్రయవిక్రయ లాభం, నూతన వ్యక్తులు, గొప్పవారితో పరిచయములు, సంఘములో గౌరవము, పలుకుబడి.
9) సెప్టెంబరు:
భార్యాబిడ్డలకు కష్టములు, వృధా ప్రయాణములు, వ్యాధి, దారిద్య్రత, పితృ వర్గమునకు అరిష్టము, కొన్ని సందర్భాలలో అల్ప సుఖము, సుఖసంతోషములు, శతృవులు మిత్రులగుట, శాస్త్ర సంబంధము, పురాణములు, ఉపన్యాసములు వినుటయందు ఆసక్తి, దైవ కార్యములలో పాల్గొనుట, పుణ్యక్షేత్ర సందర్శనములు, వ్యవసాయదారులకు లాభం, మనస్సుకు స్థిమితము లేకపోవుట, విరోధములు వచ్చుచుండుట, దీర్ఘ రోగ బాధలు కొంత నయం.
10) అక్టోబరు:
ధర్మ విజ్ఞత వంటి స్వల్ప అనుకూల ఫలదము కలుగును. నూతన వ్యక్తులు, గొప్పవారితో పరిచయములు, వ్యాపారస్తులకు క్రయ విక్రయముల రీత్యా లాభించుట, కలిసివచ్చుట, బంధు మిత్ర సమాగమము, విందు వినోదములలో పాల్గొనుట,నూనె సరుకులు తినుటయందు ప్రీతి, సంఘములో గౌరవము, పలుకుబడి, సంగీత - సాహిత్యములు - కళలయందు ఆసక్తి, ధనలాభం.
11) నవంబరు:
దోష ఫలదము, పాప కార్యాచరణ, వృత్తి నష్టము, కర్మ భ్రష్టత, పరితాపము, దుఃఖము, మానభంగము, తలంచిన కార్యములు జయము, భార్యాబిడ్డల వలన సుఖసౌఖ్యములు, వ్యాపార వ్యవహారములందు ధనలాభము, సంఘములో గౌరవము, పలుకుబడి, అధికారానుగ్రహం, లోన్లు శాంక్షను అవుట, గృహ నిర్మాణాది కార్యక్రమములు నెరవేరుట, నూతన వ్యాపారములు ప్రారంభించుట, బంధుమిత్రులతో కలియుట, ఉద్యోగ ప్రాప్తి, లాభం, ఎక్కువసార్లు ప్రయాణములు చేయుట, మనస్సుకు ఉత్సాహము, ఆనందము.
12) డిశంబరు :
విఘ్నములు, వ్యాకులత, ఆదాయ నష్టం, కీర్తి, ఉద్యోగమందు బాధలు వంటి కష్టనష్టములు కలుగును. అధికారుల వలన చికాకులు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించుట, కుటుంబ కలతలు, అన్నదమ్ములకు పడకపోవుట, మనస్సునకు ప్రశాంతత లేకపోవుట, స్థిరాస్థి విషయంలో తగాదాలు, కుట్రలు, బంధువర్గములో ఆధిక్యత, సంఘములో గౌరవము, పలుకుబడి, ప్రయాణములు చేయునుండగా మార్గమధ్యములో ఆటంకములు.
-
ఇంటికి వాస్తు దోషాలుంటే రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేయండి -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
కర్కాటకరాశి వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారం.. అన్నింటా విజయం! -
today rashiphalalu: నేడు బృహస్పతి, బుధుల స్థానాలలో మార్పు.. వీరికి జాక్ పాట్! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే?












Click it and Unblock the Notifications