Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ధనుస్సు రాశి ఫలాలు 2017 సంవత్సరానికి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం

మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, మీ పేరులో మొదటి అక్షరము యే, యో, బా, బి, బూ, ధా, భా, ధా, బే అను అక్షరములలో ఒకటి అయినచో మీది ధనస్పురాశి.

మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, మీ పేరులో మొదటి అక్షరము యే, యో, బా, బి, బూ, ధా, భా, ధా, బే అను అక్షరములలో ఒకటి అయినచో మీది ధనస్పురాశి.

Sagittarius horoscope

1. 2017 జనవరి:

కష్ట నష్టములుకలుగుతాయి, బంధుజనులతో విరోధము ఏర్పడుతుంది, ఆందోళన కలుగుతుంది, అవమానము ఏర్పడతాయి, అన్ని రంగముల వారికి అనుకూలకాలము. తలంచిన కార్యములు, చేయు పనులలో విజయము సాధించుట, వ్యాపార లాభం, ధనము ఏదోరూపేణా కలిసివచ్చుట, అధికారుల వలన ఉపకార లాభములు పొందుట, కుటుంబ సంతాన సౌఖ్యం, బంధు మిత్ర కలయికలు, ఋణ విముక్తి, స్త్రీలకు నూతన వస్తు వస్త్రాభరణ ప్రాప్తి, శరీర ఆరోగ్యము బాగుండుట.

2. ఫిబ్రవరి:

ధన నష్టము కలుగుతుంది, దూర ప్రాంతములకు వెళ్ళి వచ్చు పరిస్థితి ఏర్పడుతుంది కార్యములు ఆరంభించుట, అన్ని వర్గముల వారితోను స్నేహం చేస్తూ లాభములు, చేయు వృత్తి వ్యాపారములందు కలిసివచ్చుట, ధనలాభం, ఉద్యోగాభివృద్ధి, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, పెద్దల ఆశీస్సులు పొందుట, వ్యసనములు - పందెములు కాయుట వలన కొంత ధనవ్యయమునకు దారితీయును. స్థానచలనమునకు అవకాశములు గలవు. జీర్ణశక్తి లోపించుట, అనారోగ్యం.

3. మార్చి:

దైన్యత కలుగుతుంది, బుద్ధి నిలకడగా వుండదు, గౌరవానికి భంగము.మాటవిలువ తగ్గుట జరుగును. నూతన శతృవులు మితృలగుట, స్నేహితులు - బంధువులు - కుటుంబ సభ్యుల కలిసి మెలిసి వుండుట, నిలిచిపోయిన పనులు పూర్తి చేయుట, వ్యవహారములు పరిష్కారమగుట, భూమి - స్థలము బిల్డింగు కొనుట, అగ్రిమెంట్ల వ్రాయించుకొనుట రిజిస్టేషన్లు చేయించుకొనుట, ఎన్ని గొడవలున్నా శాంతముగా పనులు పూర్తిచేసుకొనుట, శుభవార్తలు వినుట, ఎంతటి ధనవ్యయమునైనా భరించగలుగుతారు. వేళకు భోజనము చేయకపోవుటచే అనారోగ్య బాధలు.

4. ఏప్రియల్:

తీవ్ర వ్యతిరేక ఫలములు పొందుతారు. అనారోగ్యం కలుగుతుంది, వివాదములు ఏర్పడుతాయి, ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడతాయి, మనస్సుకు స్థిమితము లేకపోవుట, వివాహాది శుభకార్యములలో పాల్గొనుట, విందు భోజనములు చేయుట, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవుట, ఆదరణ తగ్గుట, రాబడికి మించిన ఖర్చులు, వృత్తి వ్యాపారములు చేయువారికి ఏదో రూపేణా సౌమ్మ చేతికి అందుచుండుట, లోను శాంక్షను అగుట, అధికారుల వలన మాటలు పడుట జరుగును.

5.మే:

ఎక్కువ శ్రమచేయవలసి వస్తుంది, దారిద్య్రత కలుగుతుంది, ఖర్చు పెరుగుతుంది, బంధుజనులతో విరోధము ఏర్పడుతుంది, ఉన్నచోటు మార్పు జరుగుతుంది, చేసే పనులకు హాని జరుగుతుంది, వ్యాపారాభివృద్ధి, ధనలాభం, తలపెట్టిన కార్యక్రమములు ఫలోన్ముఖమునకు వచ్చుట, సంఘములో గౌరవము, పలుకుబడి, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, కుటుంబసౌఖ్యం, సుఖ సంతోషములు పొందుట, పెద్దల ఆశీర్వాదమును పొందుట, శుభవార్తలు వినుట, ఉద్యోగప్రాప్తి, ఉద్యోగాభివృద్ధి, ఆరోగ్యము బాగుండుట.

6. జూన్:

అధికారం,గౌరవం తగ్గుతుంది, వ్యాపారంలో నష్టముఏర్పడుతుంది, అన్నిపనుల్లో అవాంతరములు కలుగుతాయి, మిత్రులకు దూరమౌతారు, స్థితి నాశము. భార్యాబిడ్డల వలన చికాకులు, స్త్రీలతో కలహములు, తలంచిన పనులు ఆలస్యముగా నెరవేరుట, వాదోపవాదములు, పలువురిలో గౌరవము, కీర్తి, స్థిరాస్తులు కలసివచ్చుట ద్వారా ధనలాభం, పుణ్యకార్యములు చేయుట, కుటుంబములోనివారు వేరుగా కాపురము పెట్టుట, ప్రయాణములు చేయునప్పుడు వస్తువులు మరచిపోవుట, నష్టపోవుట.

7. జూలై:

అన్నదమ్ములు, అప్పచెల్లెండ్రతో విరోధము, అధికారుల వలన చికాకులు, తక్కువవారి వలన మాటలు పడుట, జాయింటు వ్యాపారములు కలిసిరాకపోవట, అశుభవార్తలు వినుట, తరచు ప్రయాణములు చేయుట, స్థిరత్వము లేకపోవుట, ధనవ్యయం, శక్తికి మించిన పనులు విరమించుట మంచిది.

8 .ఆగష్టు:

ఏలినాటి శనిలో ఇది రెండవ రాశి చలన కాలము. జన్మరాశిలో శనిగ్రహ చలనం తీవ్రదోష ఫలితాలనిస్తుంది. మధ్యవర్తుల ద్వారా సమస్యలు అనుకూలముగా పరిష్కారమగుట, ఆలస్యముగా పనులు నెరవేరుట, శుభకార్యములు జరుగుట, బంధు మిత్ర సమాగమము, పాత బాకీలు వసూలగుట, ఏదో ఒక విధముగా సొమ్ము చేతికి అందుట, ఇంటికి కావలసిన వస్తువులను సమకూర్చుకొనుట, రహస్యాంగములకు సంబంధించిన బాధలు.

9. సెప్టెంబరు:

శరీరంలో తేజస్సు తగ్గటం, భయం, రోగంకలుగుతాయి, దుఃఖము పొందుతారు, బంధువులకు దూరమౌతారు, తలంచిన పనులు నెరవేరుట, మిత్రుల వలన సహాయ సహకారములు, శతృవులు మిత్రులగుట, రాజకీయ వలన ఉపకార లాభములు పొందుట, చేయవలసిన పనులకు ముందంజ వేయుట, శుభకార్యముల నిమిత్తము ధనము ఖర్చు చేయుట, మంచి పనులకు చేయూత నిచ్చుట, ధర్మ కార్యములలో పాల్గొనుట.

10) అక్టోబరు:

బంధువులతో శత్రుత్వము ఏర్పడతాయి, శ్రమకరమైన ప్రయాణాలు చేస్తారు, చేసేపనులలో అవరోధాలు ఏర్పడతాయి, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, సంతోష వార్తలు వినుట, ధనలాభం, కుటుంబ సౌఖ్యము, వ్యాపారములలో విశేష లాభం, చేయు పనులలో ఉత్సాహము, ప్రయాణమూలక లాభం, బంధు మిత్రుల ఆదరణ లభించుట, అధికారుల వలన మెప్పు పొందుట, నూతన వస్తు వస్త్రాభరణ ప్రాప్తి.

11) నవంబరు:

తప్పుడు పనులుచేస్తారు, బుద్ధి చపలంగా మారుతుంది, రోగము వలన బాధ కలుగుతుంది, హృదయము నందు వ్యాధి వంటి వ్యతిరేక ఫలములు కలుగును. నూతన వ్యక్తులతో స్నేహ లాభములు, లోన్ల శాంక్షను అయి "ధనము చేతికందుట, మనస్సు ఆలోచనలతో నిండివుండుట, దూరప్రాంతములకు వెళ్ళు ప్రయత్నములు చేయుట, జాయింటుదారులతో పేచీలు, కలహములు, చేయు వృత్తిలో నైపుణ్యము వహించుట, వ్యాపారములో లాభించుట, వాహన ప్రమాదములు, ఆరోగ్యము లోపించుట.

12) డిశంబరు:

తప్పుడు పనులుచేస్తారు, బుద్ధి చపలంగా మారుతుంది, రోగము వలన బాధ కలుగుతుంది, హృదయము నందు వ్యాధి వంటి వ్యతిరేక ఫలములు కలుగును. మనస్సు నిలకడ లేకపోవుట, దుష్ట సహవాసములు, చెడువ్యసనములకు లోనవుట, బంధు మిత్ర కలహములు, వేళకు సరిగా భోజనము చేయకపోవుట, అధికారుల వలన మాటలు పడుట, అపనిందలు, భార్యాభర్తల మధ్య గొడవలు, చేయు వృత్తి వ్యాపారములలో కలిసిరాకపోవుట, ఋణ బాధలు, వ్యయ ప్రయాసలు, అనారోగ్యం, ధనస్సు రాశి వారు ఏలినాటి శనిదోష పరిహారమునకు శనికి 19 వేలసార్లు జపం - నువ్వులు దానం లేక శని త్రయోదశికి శనికి తైలాభిషేకం - నువ్వులు దానం. వెంకటేశ్వర దీపారాధన, ఆంజనేయస్వామికి తమలపాకులతో పూజ, అప్పములు నైవేద్యము పెట్టుట. రాహు - కేతు దోష పరిహారములకు పూజలు, దుర్గా సప్తశతి పారాయణం, దేవీ ఖడ్గమాల పఠించుట. ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రములను దర్శిచుట, ఆరాధించుట చేయవలెను.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+