వృషభ రాశి వారికి 2017వ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దాం
కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1,2 పాదాలు,మీ పేరులో మొదటి అక్షరము ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వు, వే, వో అను అక్షరములలో ఒకటి అయినచో మీది వృషభరాశి.
కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1,2 పాదాలు,మీ పేరులో మొదటి అక్షరము ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వు, వే, వో అను అక్షరములలో ఒకటి అయినచో మీది వృషభరాశి.

1) 2017 జనవరి:
మిక్కిలి అనుకూల స్థానం. సకలవిధ సౌభాగ్యసిద్ధి, గృహలాభము కలుగుతుంది, ఏ రంగంలోనున్న వారికైనా అభివృద్ధి, వృత్తి, వ్యాపారములలో ధనాదాయము, పలుకుబడి, బంధు మిత్ర సమాగమము, సినీ, నటీనటవర్గము, కళాకారులకు సన్మానములు, గాయకులకు, రచయితలకు గుర్తింపు, ప్రయాణముల రీత్యా ధనవ్యయం, నూతన వస్తు వస్రాభరణప్రాప్తి, భార్యాభర్తల మధ్య అవగాహన, సఖ్యత, ఆకస్మిక ప్రమాదములు, ప్రాణభయం.
(2) ఫిబ్రవరి:
కుటుంబంలో సౌఖ్యము పొందుతారు, అన్నివిధాల అభివృద్ధి కలుగుతుంది, ఆచార జీవనము జీవిస్తారు, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, బంధుమిత్ర సమాగమము, నూతన వ్యక్తుల వలన స్నేహలాభములు, గృహోపకరణములకు వస్తు సామాగ్రిని సమకూర్చుకొనుట, ధనాదాయం బాగుండుట, భార్య, పిల్లలతో ఆనందముగా గడుపుట, వృత్తి-వ్యాపారములలో కలిసివచ్చుట, ఉద్యోగప్రాప్తి, ఆరోగ్యము బాగుండుట.
3) మార్చి:
అనుకున్న పనులు సాధిస్తారు, కొత్త వస్తువులు పొందుతారు, ధనలాభము కలుగుతుంది, అనుకున్న పనులు నెరవేరుట, చేయు కృషి వృద్దిగా వుండుట, ధనలాభం, కుటుంబసౌఖ్యం, శతృవులు మిత్రులగుట, అధికారానుగ్రహం, శుభవార్తలు వినుట, వ్యవహారములు కలిసివచ్చుట, సంతానాభివృద్ధి, ఉద్యోగప్రాప్తి, వ్యాపారలాభం, బాకీలు వసూలగుట, కొంత ఋణ విముక్తి, సమస్యలు పరిష్కారమునకు వచ్చుట, గౌరవాభిమానములు పెరుగుట, ఎత్తు నుండి జారిపడుట, ఆకస్మికముగా దెబ్బలు తగులును.
4) ఏప్రియల్:
భోజనము చేస్తారు, స్త్రీ సౌఖ్యము పొందుతారు. ప్రారంభములో అన్నివిధములా కలిసివచ్చును. చేయు వృత్తి-వ్యాపారములలో లాభించుట, రాణించుట జరుగును. ఆరోగ్యము బాగుండును. ఏదో రకముగా సొమ్ము చేతికందుచుండును. ఆదాయము బాగుండును. ఏప్రియల్ 13 నుండి బంధు మిత్రులతో విరోధము, అనవసర ధనవ్యయం, అపనిందలు, ఎంత మంచిగా వున్నా పేచీలు, తలనొప్పి, శ్రమ, త్రిప్పట, అనారోగ్యం.
5) మే:
వ్యతిరేక ఫలస్థానం. ఎక్కువ శ్రమ చేస్తారు, రాజభయములేదా పై అధికారులచేత, ప్రభుత్వం చేత భయం పొందుతారు, ఉద్యోగస్తులకు పై అధికారుల వలన వత్తిడి, స్థానచలనములు, బంధుమిత్ర" విరోధములు, శిరస్సుకు, కంటికి సంబంధించిన వ్యాధులు, వేళకు సరిగా తిండి తినకపోవుట, అనారోగ్యం, పని వత్తిడి ఎక్కువగుట, జాయింటుదార్లతో మనస్పర్ధలు, మనస్థిమితము లేకపోవుట, విందు-వినోదములలో పాల్గొనుట, ధనము ఖర్చు చేయుట.
6) జూన్:
చేసే పనులలో ఆటంకములు కలుగుతాయి, గౌరవం తగ్గుతుంది, మనస్థాపము, ఎంత పని చేసినా మెప్పు పొందలేకపోవుట, కుటుంబములోను, చేయు వృత్తి వ్యాపారములలోను తగాదాలు, అనవసర గొడవలు, దుష్టసహవాసములు, వ్యసనములకు , ధనవ్యయం, శతృవులు మిత్రులగుట, సంగీత సాహిత్యములు, కళలు, శాస్త్ర సంబంధమైన చర్చలలో పాల్గొనుట, క్రయ విక్రయ లాభం.
7) జూలై:
కష్టతరమైన నష్టప్రదమైన ప్రయాణాలు చేస్తారు, అరిష్టము కలుగును, ధననష్టము జరుగుతుంది, చంచల మనస్సు, అన్నదమ్ములతోను, బంధువులతోను, సఖ్యత లేకపోవుట, శరీరమునందు నొప్పులు, జబ్బుపడుట, తలంచిన కార్యములలో జయము, భార్యాపుత్రుల వల్ల సుఖ సౌఖ్యములు చేకూరుట, సంఘములో గౌరవము, పలుకుబడి, తల్లిదండ్రులు, పూర్వీకుల ఆస్టి కలియుట, ధనలాభము, ఉత్సాహము, దైవ కార్యములలో పాల్గొనుట.
8) ఆగష్టు:
దేహకాంతి తగ్గుతుంది, దొంగల వల్ల భయము కలుగుతుంది, కష్టనష్టాలు కలుగుతాయి. తలంచిన కార్యములు నెరవేరుట, సుఖ సౌఖ్యములు, ధనధాన్యవృద్ధి, వ్యాపారాభివృద్ధి, ధనలాభం, నూతన వస్తు వస్త్రలాభం, సంగీత సాహిత్యములు, కళలయందు ఆసక్తి, సభలలో పాల్గొనుట, వివాహాది శుభకార్యములు నెరవేరుట, బంధుమిత్రులతో విందు వినోదములతో కాలక్షేపము చేయుట, ఉద్యోగస్తులకు పలుకుబడి.
9) సెప్టెంబరు:
ఏడవ రాశియందు శని సంచరించు స్థానమున రోగమును, దేశాంతర ప్రయాణమును, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించుట, కుటుంబ కలహములు, ప్రయాణములు చేయునప్పుడు మార్గమధ్యములో ఆటంకములు ఏర్పడి తిరిగివచ్చుట, అధికారుల వలన మాటలు పడుట, రాబడికి మించిన ఖర్చులు, స్థిరాస్థి విషయంలో తగాదాలు, కుట్రలు, బంధువులలో ఆధిఖ్యత, మనశ్శాంతి లేకపోవుట, చోరభయం.
10) అక్టోబరు:
హృదయమునకు కష్టము, గొప్పభీతిని, ద్రవ్యనాశనమును, హృదయ తాపమును, సంఘములో గౌరవము, పలుకుబడి, క్రయ విక్రయముల వలన లాభించుట, చేయు కృషియందు అభివృద్ధి, తలంచిన పనులు నెరవేరుట, ధనలాభం, కుటుంబ సౌఖ్యము, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, బంధుమిత్రులలో ఏర్పడిన వైషమ్యములు పెద్దల యొక్క సహాయ సహకారములు, అధికారుల మన్ననలు.
11) నవంబరు:
అలసట, భార్యాబిడ్డలకు అనారోగ్యము, వేదన కల్పించును. తలంచిన కార్యములకు ఆటంకములు, అధికారుల వలన చికాకులు, కుటుంబములోని వారికి అనారోగ్యము, ఔషధ సేవలు చేయుట, భార్యతో మనస్పర్థలు, స్త్రీలతో విరోధము, ఎంత మంచిగా వ్యవహరించుకుందామనుకున్నా పేచీలు, వ్యాపారస్తులకు వడిదుడుకులు, మానసిక అశాంతి, శ్రమ, త్రిప్పట, అనవసర ధనవ్యయం.
12) డిశంబరు:
శని ఆరవ రాశి యందు సంచరించు కాలమున ధనధాన్య అభివృద్ధి, బంధువులతో సంతోషము, ఆలస్యముగా పనులు నెరవేరుట, నమ్మిన వారి వలన దగాలు, మోసపోవుట, కుటుంబములోని వారితో తగాదాలు, స్థలమార్పులు, మాటపట్టింపులు, ఆరోగ్యం బాగుండకపోవుట, వేళకు సరిగా భోజనము చేయకపోవుట, ప్రారంభములో చికాకులు కలిగినా కష్టముతో పనులు నెరవేరుట, ఆలస్యముగా ధనము చేతికందుట, రహస్యాంగములకు సంబంధించిన వ్యాధులు.
-
కర్కాటకరాశి వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారం.. అన్నింటా విజయం! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
ఇంటికి వాస్తు దోషాలుంటే రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేయండి -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
వాస్తు ప్రకారం మెయిన్ ఎంట్రన్స్ దక్షిణం, ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం ఉంటే ఏం చేయాలి? -
today rashiphalalu: నేడు బృహస్పతి, బుధుల స్థానాలలో మార్పు.. వీరికి జాక్ పాట్! -
ఉగాది నుండి వీరికి ధనయోగం.. బిజినెస్ అద్భుతం.. వృషభరాశి జాతకమిలా! -
మీన, కుంభ రాశులలో ముఖ్య గ్రహాలు.. వీరికి నేడు డబ్బులే డబ్బులు! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్












Click it and Unblock the Notifications