బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి.. మీ విరాళాలే ప్రాణాలు నిలుపుతాయి..!!
ఛత్తీస్‌గఢ్‌లో ఓ మధ్యతరగతి కుటుంబం నివసిస్తోంది. ఆ తల్లిదండ్రులకు ఓ కూతురు ఉంది. కూతురు పేరు ఆర్వీ అవస్తీ. కూతురే ప్రపంచంగా జీవిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. తండ్రి చిరుద్యోగి. ఇళ్లు గడవటం కోసం ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇంటిని పోషించుకుంటున్నాడు. ఇక కూతురు ఆర్వీకి 10 ఏళ్లు. ఈ వయస్సులో స్కూలుకు వెళ్లి తోటి విద్యార్థులతో ఎంతో చక్కగా చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయస్సులో భగవంతుడు చిన్న చూపు చూశాడు. దీంతో ఆమె ఓ అరుదైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైంది.
ఔను ఎంతో సంబరంగా తోటి మిత్రులతో హాయిగా గడపాల్సిన చిన్నారి ఆర్వీ అవాస్తీ గత కొద్ది నెలలుగా బోన్ కేన్సర్‌తో బాధపడుతోంది. ఈ జబ్బును వైద్యపరిభాషలో ఆస్టియోసర్కోమా అని పిలుస్తారు. ఈ చిన్న వయసులో చిన్నారి ఈ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌లో ఉన్న బాల్కో మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతోంది. తండ్రి చూస్తే చిరుద్యోగి. మరి ఈ జబ్బును నయం చేయాలంటే చాలా ఖర్చు అవుతోంది. ఇప్పటికే కూతురు చికిత్స కోసం ఉన్నదంతా ఖర్చు చేశారు. ఇక వారిదగ్గర ఏమీ లేకపోవడంతో ఇప్పుడు దాతల కోసం ఎదురు చూస్తున్నారు.

తన కూతురు ఆర్వీ అవాస్తీని కాపాడాలంటూ ఆ తల్లి చంద్రిక అవాస్తీ వేడుకుంటోంది. కూతురు తమకు దక్కుతుందో లేదో అన్న భయం ఆ తల్లిలో నెలకొంది. దాతల కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం బాల్కో మెడికల్ సెంటర్‌లో చికిత్స మాత్రమే పొందుతోంది చిన్నారి అవాస్తీ. అయితే ఇంకా అడ్మిట్ కాలేదు. హాస్పిటల్‌లో అడ్మిట్ కావాలంటే రోజుకు బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది. అంత మొత్తంలో డబ్బులు ఆర్వీ కుటుంబం దగ్గర లేదు. డబ్బులు ఆలస్యం అయ్యే కొద్దీ వ్యాధి ముదిరిపోతోంది. చిన్నారి ఆర్వీ అవస్తీ తమకు దక్కుతుందో లేదో అన్న అనుమానం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. 25 అక్టోబర్ 2021న ఆమె అడ్మిట్ కావాలని వైద్యులు చెప్పేశారు. ఇప్పటి వరకు రూ.4 లక్షలు ఖర్చు చేశాం. ఇదంతా తమ పొదుపు, రుణాలు, బీమా నుంచి అరేంజ్ చేశామని తల్లి చంద్రికా అవాస్తీ చెప్పుకొచ్చింది.

ఇక చిన్నారికి చికిత్స కొనసాగాలంటే ఇంకా రూ.9,95,000 అవసరం ఉంది. అంత డబ్బు తమవద్ద లేదు. ఈ క్రమంలోనే చంద్రికాతో పాటు ఆమె భర్త దాతల కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు తమకు తోచినంత మొత్తంలో సహాయం చేసి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాల్సిందిగా వేడుకుంటున్నారు. దాతలు నేరుగా బ్యాంకు ఖాతాలో కానీ లేదా గూగుల్ పే, ఫోన్ పే లేదా పేటీఎం ద్వారానైనా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఇక బ్యాంకు వివరాలు ఇలా ఉన్నాయి.

S.B.I Bank A/c:30327039988
A/c Name:Chandrika Prasad Avasthi
IFSC Code:SBIN0004440
ఇక గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన ఫోన్ నెంబర్:
7389900665












Click it and Unblock the Notifications