రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి
హైదరాబాద్: హైదరాబాద్ విజయవాడ రహదారిపై చౌటుప్పల్ వద్ద శనివారం నాడు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.
హైదరాబాద్‌లోనిజీడిమెట్ల పారిశ్రామిక వాడనుంచి సల్ఫ్యూరిక్ ఆసిడ్‌తో వెళ్లుతున్న డిసిఎం వ్యాను ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్‌లోని సల్ఫ్యూరిక్ ఆసిడ్ మీదపడటం వల్ల వ్యానులోని ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో మరణించారని పోలీసులు చెప్పారు. మృతుల్లో నలుగురిని శ్రీను, నర్సింహులు, కిరణ్ నాయుడు, వెంకన్నగా గుర్తించినట్టు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications