బిజెపికే పల్లెల మద్దతు
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ గ్రామీణాభివృద్ధి పథకాల వల్ల గ్రామీణప్రాంతాల్లో బిజెపికి మద్దతు విస్తృతంగా పెరిగిందని విశాఖపట్నంలో శనివారం నుంచి ప్రారంభమైన బిజెపి కార్యవర్గ సమావేశం అభిప్రాయపడింది.
రానున్న పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తువల్ల రెండూ పార్టీలు లాభపడే అవకాశం వున్నదని సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో చర్చను ప్రధానంగా గోదావరి జలాల వినియోగంపైనేకేంద్రీకరించారు. ఈ సమావేశాల్లో వ్యవసాయరంగం, చేనేతరంగం సమస్యలపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణాపై పార్టీ అధిష్టానవర్గం వైఖరే తమవైఖరని స్పష్టం చేశారు. సీనియర్ నేత నరేంద్ర ప్రత్యేక తెలంగాణా సమస్యను ప్రస్తావించడానికి ప్రయత్నించినప్పటికీ నాయకత్వం అందుకు అంగీకరించకపోవడంతో నరేంద్ర కినుక వహించి సమావేశాలను బహిష్కరించి హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టారు.












Click it and Unblock the Notifications