బిజెపిలో నరేంద్ర తిరుగుబాటు

విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ(బిజెపి) మెదక్‌ పార్లమెంటు సభ్యుడు ఎ.నరేంద్ర పార్టీ నాయకత్వంపై తిరుగుబాటుప్రకటించారు. ఆయన శనివారం ఉదయంప్రారంభమైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్నిబహిష్కరించారు. సమావేశాన్ని బహిష్కరించివెంటనే హైదరాబాద్‌కు బయలుదేరారు. శుక్రవారంపదాధికారుల సమావేశానికి నరేంద్ర హాజరయ్యారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుడిమాండ్‌ను పార్టీ అధిష్ఠానం కచ్చితంగా వ్యతిరేకించడంతోఆయన కార్యవర్గం సమావేశంలో పాల్గొనడం వృధాప్రయాసే అనుకుని హైదరాబాద్‌కు వెనుదిరిగినట్లు భావిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పైతదుపరి చర్చలకు అవకాశం లేదని నాయకత్వం తేల్చిచెప్పింది. దీంతో కార్యవర్గంలో తెలంగాణాపైచర్చ జరిగే అవకాశాలు మృగ్యమయ్యాయి.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకావాల్సిందే, తెలంగాణా రాష్ట్రంవుండాల్సిందేనని నరేంద్ర శనివారంహైదరాబాద్‌కు బయలుదేరే ముందు తనను కలిసినవిలేకరులతో అన్నారు. మిగతా విషయాలు హైదరాబాద్‌వెళ్లిన తర్వాత మాట్లాడుతానని ఆయన అన్నారు. భవిష్యత్తు కార్యక్రమాన్నిహైదరాబాద్‌లో ప్రకటిస్తాననిఆయన చెప్పారు. శుక్రవారం పదాధికారులసమావేశంలో తెలంగాణాపై చర్చ జరిగిందని, అయితేఏకాభిప్రాయం కుదరలేదని ఆయన చెప్పారు. శనివారం కార్యవర్గసమావేశంలో తెలంగాణా అంశాన్నిప్రస్తావించనీయకపోవడంతో ఆయన సమావేశాలనుబహిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+