మరో నలుగుర్ని కాల్చిచంపిన వార్
కరీంనగర్: తమ అగ్రనేతల్ని చంపడానికి కుట్ర పన్నారంటూబంధించిన మరో నలుగురిని కూడా కూడా పీపుల్స్‌వార్‌కాల్చివేసింది. కోవర్టు సభ్యులుగా 12 మందిని గుర్తించి మూడు రోజుల క్రితంపీపుల్స్‌వార్ బంధించింది. ఆ పన్నెండు మందిలో ఆరుగుర్ని శుక్రవారంకరీంనగర్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దులో కాల్చివేసినవిషయం తెలిసిందే. మరో నలుగురిని కూడాకాల్చివేసివారి శవాలను నిజామాబాద్ జిల్లాలోని మానాల అడవిప్రాంతంలోపారేశారు. ఈ శవాలను శనివారంకనుక్కున్నారు. పీపుల్స్‌వార్ బంధించిన 12 మందిలోఐదుగురు దళ సభ్యులు, ఏడుగురు పోలీసుఇన్‌ఫార్మర్లు వున్నారు. బందీల్లో ఇద్దరిని మాత్రం తీవ్రంగా కొట్టి హెచ్చరికలతో వదిలిపెట్టారు.
ఈ హత్యాకాండతో పోలీసులకు ఏమాత్రం సంబంధం లేదని పీపుల్స్‌వార్ అంతర్గత వ్యవహారమని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో లభించిన మృతదేహాల్లో పోలీసులకు తెలిసినవారెవ్వరూ లేరని ఆయన చెప్పారు. కోవర్ట్ ఆపరేషన్స్ భయంతో సొంతపార్టీవారినే వార్ కిరాతకంగా హతమార్చడం, నక్సల్స్‌వైపు ఆకర్షితులయ్యే యువతీయువకులకు ఒక గుణపాఠం కాగలదని వారు అన్నారు.
శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిపీపుల్స్‌వార్ ఉత్తర తెలంగాణా స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడుఆజాద్‌తో పాటు మరి కొంత మంది నేతలు కోవర్టు సభ్యుల గురించినవివరాలు చెప్పారు. ఈ 12 మందిని మూడు రోజుల క్రితంపీపుల్స్‌వార్ బంధించి వారిని చిత్రహింసలుపెట్టి నిజాలను రాబట్టింది. గత రెండు రోజుల కాలంలో మొత్తం పదిమందిని పీపుల్స్‌వార్ కిరాతకంగా చంపడం కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
- విద్రోహులపై వార్-6గురి కాల్చివేత












Click it and Unblock the Notifications