ఎన్నికల వ్యూహంపై కాంగ్రెస్ కమిటీ
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మరో నాలుగయిదురోజుల్లో వెలువడే అవకాశం వుండటంతో ప్రధాన రాజకీయపార్టీలన్ని ఎన్నికల వ్యూహానికి సంబంధించిన కసరత్తులో మునిగిపోయాయి. ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక మొదలు, ప్రచారం వరకు పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై తగిన సూచనలు సలహాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో గాదె వెంకటరెడ్డి, కెఎస్‌ఆర్ మూర్తి, అమోజ్, చక్రపాణి వున్నారు. ఎన్నికల నేపథ్యంలో పిసిసి నేత సత్యనారాయణరావు మంగళవారం నాడు నిర్వహించిన డిసిసి నేతలు, జిల్లా పరిశీలకుల సమావేశంలో ఈ కమిటీ నియామకాన్ని ప్రకటించారు. వామపక్షాలతో పొత్తుకు సంబంధించి చర్చలేమీ జరగలేదని సత్యనారాయణరావు తెలిపారు. పొత్తుకు తాము సిద్ధంగానే వున్న వామపక్షాల
వైఖరేమిటో తెలియదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications