రాజధానిలో దొంగలు బాబోయ్‌ దొంగలు!

హైదరాబాద్‌ః రాష్ట్ర రాజధాని శివార్లలో బందిపోట్ల ముఠా సోమవారం బీభత్స సృష్టించింది. నాగోల్‌ వద్ద బి.పి.ఎల్‌. గోడౌన్‌ ను లూటీ చేయడంతో పాటు అక్కడ నిలిపి వుంచిన లారీకి దొంగలు నిప్పుపెట్టి పరారయ్యారు. వనస్థలిపురంలో ఓ ఇంటిపై దాడి చేసి 40 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు దోచుకున్నారు.

నాగోల్‌ లోని బి.పి.ఎల్‌. గోడౌన్‌ పై 12 మంది సభ్యులు గల దోపిడీ దొంగల ముఠా దాడి చేసింది. సుమారు 20 లక్షల రూపాయలువిలువచేసం టి.వి.లు వి.సి.డి.లను దోచుకుంది. ఆ తరువాత పదిలక్షల రూపాయలవిలువచేసే టివిల లోడ్‌ తో వున్న లారీకి దోపిడీ దొంగలు నిప్పుపెట్టి పరారయ్యారు. ఆదివారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన జంటనగరాలలో సంచలనం సృష్టించింది.

వనస్థలిపురంలో....
వనస్థలిపురంలోని కమలానగర్‌ లో మిధానిలో టెక్నీషిటన్‌ గా పనిచేస్తున్నఎం. మురళి ఇంటిపై సోమవారం రాత్రి దొంగలు దాడి చేశారు. కిటికీ ఊచలు వంచి లోనికి ప్రవేశించిన దొంగలు మురళి ఆయన భార్య రవికుమారి, పిల్లలను నిద్రలేపి కత్తులతో బెదిరించారు. ఆ తరువాత పిల్లలు, మురళి అత్తగారిని ఓ రూంలో నోట్లో గుడ్డలు కుక్కి బంధించారు. రెండు గంటలపాటు యధేచ్ఛగా దోపిడీపర్వం సాగించారు.

40 తులాల బంగారం, రెండు వేల రూపాయల నగదు దోచుకున్నారు. నలుగురు దొంగలను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన మురళిని దొంగలు గాయపరిచారు. మురళి ఈవిషయాన్ని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. శివార్లలో నివశించే ప్రజలు తమ ఇళ్ళలో అలారం ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ప్రజలకువిజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+