హైటెక్ ఆస్పత్రికి బాబుశ్రీకారం
హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం హైదరాబాద్ ను ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలోపేదరికం, దారిద్ర్య నిర్మూలనకు తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడివున్నదని ఆయన చెప్పారు. భాగ్యనగరంలోని ముషీరాబాద్ జైలు ఆవరణలో గాంధీ ఆస్పత్రి భవన సముదాయానికి చంద్రబాబు నాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు.
ముషీరాబాద్ లోని జైలు ప్రాంగణంలో అత్యంత అధునాతన ఆస్పత్రి సముదాయాన్ని నిర్మిస్తున్నారు. 17 ఎకరాలవిస్తీర్ణంలో వున్న ఈ సువిశాల ప్రాంగణంలో అత్యంత అధునాతన సౌకర్యాలతో ఆస్పత్రిని నిర్మిస్తారు. వెయ్యి పడకలు, 24స్పెషాలిటీలు, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల, 300 మందివిద్యార్ధులకు హాస్టల్, మెడికల్ ఆఫీసర్లకుక్వార్టర్లు కూడా నిర్మిస్తారు. 40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టును 15నెలల్లో పూర్తి చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే రోగులతో కిటకిటలాడే గాంధీ ఆస్పత్రి శిధిలావస్థకు చేరడంతో ఈ ఆస్పత్రిని ముషీరాబాద్ ప్రాంగణానికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ అన్నివర్గాలవిజ్ఞప్తితో ఆస్పత్రి నిర్మించేందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఆమోదించింది.












Click it and Unblock the Notifications