దుబాయ్ ఇంటర్నెట్‌సిటీ విస్తరణ
దుబాయ్: దుబాయిలో అత్యాధునిక వసతి సౌకర్యాలతో ఏర్పాటైన ఇంటర్నెట్ సిటీ భారీ ఎత్తున విస్తరణకు పథకాలు వేస్తున్నది. ఇప్పటికే ఈ ఇంటర్నెట్ సిటీలో 228 అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఏడాది కాలంలో మరో 70 కంపెనీలను ఈ జాబితాలోకి చేర్చాలని నిర్ణయించారు.
మైక్రోసాఫ్ట్, ఒరకిల్, ఐబిఎం హెవ్లెట్ పాకార్డ్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ కేంద్రంలో తమ శాఖలను ప్రారంభించడానికి అంగీకరించాయి. మధ్యప్రాచ్యం, యూరప్, సింగపూర్‌కు దుబాయి గేట్‌వేలా వుంటుందని అందువల్ల ఇక్కడ తమ స్థావరాల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలు మరోఆలోచనలేకుండాముందుకు వస్తున్నాయని ఇంటర్నెట్ సిటీ నిర్వాహకులు అంటున్నారు. 400 ఎకరాల్లో 50 కోట్ల డాలర్లు వెచ్చించి ఈ ఎలక్ట్రానిక్ సిటీని అత్యాధునిక పద్దతుల్లో నిర్మిస్తున్నారు.
- మొబైల్ ఫోన్‌లో చాటింగ్ సర్వీస్












Click it and Unblock the Notifications