ఆక్రమిత కాశ్మీరేఅసలు సమస్య
న్యూఢిల్లీ; జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని ఆ విషయంలో మరో మాటకు తావులేదని ప్రధాని వాజ్‌పేయి స్పష్టం చేశారు. వచ్చే నెలలో ఢిల్లీరానున్న పాకిస్తాన్ సైనిక పాలకుడు జనరల్ ముషారఫ్‌తో చర్చల్లో ఆక్రమిత కాశ్మీర్ ప్రధాన అంశంగా వుంటుందని ఆయన ప్రకటించారు. పాక్‌తో శిఖరాగ్ర సభకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్న దశలో ప్రధాని ప్రకటన సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు.
మోకాలి శస్త్రచికిత్స కారణంగా ఈ నెల ఏడో తేదీనుంచి ముంబాయిలోని బ్రీచ్‌కాండి ఆస్పత్రిలో వున్న ప్రధాని మంగళవారం నాడు డిశ్చార్జి అయ్యారు. శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపి కూడా తీసుకున్న వాజ్‌పేయి సొంతగా నడవడానికి మరో వారం రోజులు పడుతుంది. ప్రస్తుతం ఆయన వీల్‌చైర్‌పైనే వున్నారు. డిశ్చార్జి తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జమ్మూకాశ్మీర్ పాకిస్తాన్‌తో చర్చల్లో అసలు విషయమే కాదని జమ్మూకాశ్మీర్‌లో అంతర్భాగమని సమస్యల్లా పాక్ ఆక్రమిత కాశ్మీరేనని ఆయన స్పష్టం చేశారు.
ముషారఫ్‌తో చర్చల తర్వాత ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలకు తావులేని సత్‌సంబంధాలు ఏర్పడగలవన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. ముషారఫ్‌తో శిఖరాగ్ర సమావేశానికి ముందుగా తాను అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటానని ఆయన తెలిపారు. అఖిలపక్షంలో వ్యక్తమైన సూచనలు సలహాల ఆధారంగా తాము చర్చలకు సంబంధించిన వ్యూహాన్ని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. కాగా ముంబాయి నుంచి తిరిగివచ్చిన వాజ్‌పేయి ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితికి అవగాహనలోపమే కారణమని ఆయన చెప్పారు. మణిపూర్ సరిహద్దుల్లో ఏలాంటి మార్పు వుండదని తాము ఇప్పటికే అనేక మార్లు స్పష్టం చేశామని
ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications