అస్సాంకు పాకిన నాగా చిచ్చు
ఇంఫాల్‌ః నాగాలాండ్ తీవ్రవాదులతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం మణిపూర్ లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడంతో రాజుకున్న చిచ్చు రావణకాష్టంలా మండుతున్నది. ఆ అగ్నికీలలు ఇప్పుడు అస్సాంకు పాకాయి. కేంద్ర ప్రభుత్వం గ్రేటర్ నాగాలాండ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నదంటూ కొన్ని రాజకీయ పార్టీలు బుధవారం అస్సాం బంద్ కు పిలుపునిచ్చాయి. దీనితో ఈశాన్య రాష్ట్రాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మణిపూర్ లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతునే వున్నది. సోమవారం జరిగిన కాల్పులలో మరణించిన 13 మంది పౌరులకు బుధవారం నాడు అంత్య క్రియలు నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యగా వేలాది మంది సాయుధులైన పోలీసులను నియమించినప్పటికీ మణిపూర్ లో ఇంకా ఉద్రిక్తకర వాతావరణం కొనసాగుతునే వున్నది.












Click it and Unblock the Notifications