బాల్‌రెడ్డికి ఆక్లాండ్ కోర్టులో చుక్కెదురు
ఆక్లాండ్‌ః భారతదేశం నుంచి యువతులను అక్రమంగా తరలించి వారిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో 38 ఏళ్ళ జైలుశిక్ష పడిన లక్కిరెడ్డి బాల్ రెడ్డికి ఆక్లాండ్ కోర్టులో చుక్కెదురైంది. యువతులను హింసించడంతో పాటు వారిని తప్పుడువీసాలతో అమెరికాకు తరలించిన నేరం రుజువు కావడంతో బాల్ రెడ్డికి 38 ఏళ్ళ జైలుశిక్ష పడినవిషయం విదితమే. ఆయితే తనకు విధించిన జైలు శిక్షను ఆరేళ్ళకు తగ్గించాల్సిందిగా బాల్ రెడ్డి ఆక్లాండ్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి శిక్ష తగ్గించేందుకు నిరాకరించారు.
బాధితులతో పాటు బాల్ రెడ్డి బంధువులు కూడా ఆయన యువతులను అమెరికాకు అక్రమంగా తరలించండంతో పాటు వారిచేత వ్యభిచారం చేయించినట్లు కోర్టులో సాక్ష్యం చెప్పడంతో బాల్ రెడ్డికి శిక్షతగ్గించమని కోరేందుకు ఏ మాత్రం ప్రాతిపదిక లేకుండా పోయింది.
ఇదిలా వుండగా మంగళవారం ఆక్లాండ్ కోర్టులో బాల్ రెడ్డి కేసువిచారణ జరుగుతున్న సమయంలో కోర్టు ఆవరణలో ఉద్రిక్తత చోటుచోసుకుంది. బాల్ రెడ్డి బంధువులు, బాధితుల బంధువుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications