మరో బందిపోట్ల దాడి
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో జరిగిన రెండు బందిపోటు దాడుల సంఘటనలు మరుపునకు రాక ముందే నగరంలోని బాగ్ అంబర్‌పేటలో ఓ ఇంటిపై బందిపోటు దొంగలు దాడి చేశారు. నగదు, నగలు దోచుకుని పరారయ్యారు. ఎసి ఆఫీసులో పని చేసి రిటైర్ సోమసుందర్‌నగర్‌లో వుంటున్న ఐ. ఏకాంబరం ఇంటిలోకి కిటికీ చువ్వలు విరిచి ఆరుగురు దొంగలు ప్రవేశించారు.
ఏకాంబరం దంపతులను కట్టేసి, కళ్లకు గంతలు కట్టారు. తన మెడలోని మంగళసూత్రాన్ని తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఏకాంబరం భార్య పెద్దగా అరిచింది. ఈ అరుపునకు పక్క గదిలోని ఆమె కొడుకు పరుగు పరుగున వచ్చాడు. అతన్ని కూడా బందిపోటు దొంగలు కట్టేశారు. వారి నోట్లో బట్టలు కుక్కి అందినంత దోచుకుని పోయారు. వారు మాట్లాడిన భాషను బట్టి బందిపోట్లను గుంటూరు జిల్లా స్టూవర్టుపురానికి చెందినవారిగా అనుమానిస్తున్నారు.ు.












Click it and Unblock the Notifications