భారత్ ప్రకటనలపై ముషారఫ్ అభ్యంతరం
ఇస్లామాబాద్: భారత్ నుంచి వెలువడుతున్న కొన్ని వివాదాస్పద ప్రకటనలపట్ల జనరల్ ముషారఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉభయదేశాల మధ్య శిఖరాగ్ర సభకు సన్నాహాలు జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి ప్రకటనల వల్ల చర్చలకు అనుకూలమైన వాతావరణం దెబ్బతినే అవకాశం వున్నదని ఆయన ఆందోళనవ్యక్తం చేశారు.
బుధవారం ఉదయం ముషారఫ్ ప్రధాని వాజ్‌పేయితో మాట్లాడారు. ముషారఫ్ వచ్చే నెల 14-16 తేదీల్లో భారత పర్యటనకు వస్తున్న విషయం విదితమే. ముషారఫ్ అభిప్రాయంతో ప్రధాని వాజ్‌పేయి కూడా ఏకీభవించారని తెలిసింది. పర్యటనకు ముందు ఏలాంటి వివాదాస్పద ప్రకటనలకు అవకాశం ఇవ్వరాదని ఇద్దరు నేతలు అంగీకరించినట్టుగా అధికారవర్గాలు తెలిపాయి.
జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఆక్రమిత కాశ్మీరే పాకిస్తాన్‌తో చర్చల్లో ప్రధాన అంశంగా వుంటుందని ప్రధాని వాజ్‌పేయి, కాశ్మీర్ విషయంలో ప్రత్యేకంగా పాక్‌తో చర్చించాల్సిందేమీ లేదని విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ చేసిన ప్రకటనల నేపథ్యంలో ముషారఫ్ వాజ్‌పేయికి ఫోన్ చేసి వుంటారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications