పొత్తుపై దేశం-బిజెపి మంతనాలు
హైదరాబాద్: త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం-బిజెపిల పొత్తుపై ఇరుపార్టీల నేతలు బుధవారం నాడు చర్చలు జరిపారు. కేంద్రమంత్రి బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ నాయకత్వంలో బిజెపి ప్రతినిధుల బృందం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌కు వెళ్లి చర్చలు నిర్వహించింది.
ఈ చర్చల్లో తెలుగుదేశం అగ్రనేత చంద్రబాబునాయుడుతోపాటు పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొన్నారు. పొత్తుపై స్థూలంగా జిల్లాల స్థాయిలోనే ఒప్పందం కుదుర్చుకోవాలని జిల్లా స్థాయిల్లో వివాదాలు తలెత్తినప్పుడే రాష్ట్ర స్థాయిలో దానిని పరిష్కారించాలని రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీనికి అనుగుణంగా రెండు పార్టీలు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిల్లో సమన్వయ సంఘాలను ఈ రెండు పార్టీలు ఏర్పాటు చేస్తాయి.
జిల్లా స్థాయి ఎన్నికల అభ్యర్ధుల ఖరారును హైదరాబాద్‌లో చేస్తారని దిగువస్థాయి ఎన్నికల్లో పోటీ చేసేవారిని జిల్లా స్థాయి నాయకత్వమే ఖరారు చేస్తుందని తెలుగుదేశం నేత చంద్రబాబు చెప్పారు. కాగా అభ్యర్ధుల ఖరారుకు సంబంధించి రెండు పార్టీలు తమతమ ప్రయత్నాలు ప్రారంభించాయి. మంగళవారం నాడు నియోజకవర్గం స్థాయి సమావేశాలను నిర్వహించిన తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలు, నేతలనుంచి అందిన సూచనలు, సిఫారసుల ఆధారంగా అభ్యర్దులను ఎన్నిక చేయనున్నట్టుగా ప్రకటించింది. బిజెపి కూడా మూడు ప్రాదేశిక కమిటీలను అభ్యర్ధుల ఎంపికకోసం నియమించింది. బుధవారం నాటి చర్చల్లో బిజెపి తరఫున ఇంద్రసేనారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు. కాగా తెలుగుదేశం నేతలు దేవేందర్‌గౌడ్, అశోక్‌గజపతిరాజు, ప్రొఫెసర్ లక్ష్మన్న తెలుగుదేశం బృందంలో వున్నారు.
గెలుపుగుర్రాలకోసం బాబు వేట












Click it and Unblock the Notifications