రాష్ట్రంలో చైనా పెట్టుబడులు మొదలు
హైదరాబాద్: రాష్ట్రంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశకు ఆర్థిక సహాయం అందించేందుకు చైనా అంగీకరించింది. చైనా ఎగ్జిమ్ బ్యాంక్ ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. 13 మంది సభ్యులతో కూడిన చైనా బృందం గురువారం రాష్ట్రంలోని పర్యటించి ఈ విషయం తెలియజేసింది. జెన్‌కో ప్రతిపాదించిన వివిధ విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులను ఈ బృందం పరిశీలించింది.
రూ. 1554 కోట్లతో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం సాగుతోంది. ఇందులో 210 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం గల మొదటి దశ పూర్తయింది. 420 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం గల రెండవ దశను మూడున్నర ఏళ్లలో పూర్తి చేయాలనేది ఆంధ్రప్రదేశ్ జెన్‌కో ఆలోచన. ఈ రెండోదశకుగాను చైనా కంపెనీ ఆర్థిక, సాంకేతిక సహకారం అందించడానికి అంగీకరించింది. భారతదేశంలో చైన కంపెనీ ఇంత పెద్ద యెత్తున పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి.












Click it and Unblock the Notifications