వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముషారఫ్‌ పై అమెరికా నిప్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః పాక్‌ సైనిక పాలకుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ పాక్‌ అధ్యక్షుడిగా బుధవారం కొత్త అవతారం ఎత్తడంపై ప్రపంచ దేశాలు విస్మయం వ్యక్తం చేశాయి. ప్రస్తుత అధ్యక్షుడు రఫీక్‌ తరార్‌ ను తప్పించి ముషారఫ్‌ దేశాధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకోవడం మంచి పరిణామం కాదని అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.

పాక్‌ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామంటూ తమ దేశంలో పర్యటిస్తున్న పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్‌ సత్తార్‌ హామీ ఇచ్చిన కొద్ది సేపటికే ముషారఫ్‌ దేశాధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడం పట్ల అమెరికా విస్మయం వ్యక్తం చేసింది. పాక్‌ లో శరవేగంతో జరిగిన పరిణామాలను పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి తమతో మాటమాత్రంగా అయినా చెప్పకపోవడం పట్ల అమెరికా ఆక్షేపణ వ్యక్తం చేసింది.

భారత్‌ తో శాంతి చర్చల సాకు చూపించి అమెరికాను ప్రసన్నం చేసుకోవాలనే పాక్‌ ఆలోచన తాజా పరిణామాలతో బెడిసికొట్టిందనే చెప్పాలి. ఐక్యరాజ్య సమితి కూడా పాక్‌ పరిణామాల పట్ల విస్మయం వ్యక్తం చేసింది. ఇప్పటికే అంతంత మాత్రంగా వున్న పాక్‌-అమెరికా సంబంధాలు ముషారఫ్‌ చర్యతో మరింత క్షీణించే ప్రమాదం వున్నదని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X