"టపాసుల సందడి మీకు.. విషపు గాలి మాకు".. భారత్ పై విరుచుకుపడ్డ పాకిస్థాన్
భారత్ లో నవంబర్ 8న దీపావళి ఘనంగా జరిగాయి. అయితే దివాళి పండుగకు టపాసులు కాల్చడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దేశ రాజధాని దిల్లీ తో పాటు ఇతర ఉత్తరాధి రాష్ట్రాల్లోని పొగ, దుమ్ము , ధూళి కారణంగా తమ దేశంలోని లాహోర్ లో వాయు కాలుష్యం పెరుగుతోందని మండిపడుతోంది. దీపావళి సందర్భంగా భారత్ లో అత్యధికంగా టపాసులు కాల్చిన నేపథ్యంలో ఆ విష వాయువులను మేఘాలు తమ దేశం వైపునకు మోసుకొస్తున్నాయని ఈ క్రమంలో లాహోర్ నగరంలో వాయి కాలుష్యం గణనీయంగా పెరిగిందని వింత వాదన చేస్తోంది. ఈ మేరకు లాహోర్ నగరాన్ని వాయు కాలుష్యం కమ్మేయడానికి భారత్ ప్రధాన కారణమని పంజాబ్ రాష్ట్ర సీనియర్ మంత్రి, పర్యావరణశాఖ మంత్రి మరియమ్ ఔరంగజేబ్ కీలక ఆరోపణలు చేశారు.
స్విస్ గ్రూప్ కు చెందిన ఐక్యూ ఎయిర్ ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ లోని లాహోర్ పట్టణం టాప్ ప్లేస్ లో ఉంది. ఈ మేరకు ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరాల్లో నిలిచింది. వరసగా ఆదివారం, సోమవారం లాహోర్ లోని గాలి నాణ్యత సూచిక 263 గా ఉందని వెరీ అన్ హెల్తీ అనే కేటగిరీ కింద లాహోర్ ఉందని ఐక్యూ ఎయిర్ తన నివేదికలో పేర్కొంది. ఇక లాహోర్ లో పీఎం 2.5 ప్రమాదకరమైన ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్లు పంజాబ్ పర్యావరణశాఖ మంత్రి మరియమ్ ఔరంగజేబ్ స్పష్టం చేశారు. తేలికైన మేఘాలు, గాలి కారణంగా భారత్ నుంచి ఈ విష వాయువులు పాకిస్థాన్ లోకి వస్తున్నట్లు ఆయన కీలక ఆరోపణలు చేశారు. అయితే మరియమ్ ఔరంగజేబ్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక భారత రాజధాని దిల్లీ ఇప్పటికే గ్యాస్ ఛాంబర్ లా మారిపోయింది. దీపావళి పండగ నేపథ్యంలో దిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారింది. మంగళవారం రోజున ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన రెండో నగరంగా దిల్లీ నిలిచింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 188 గా ఉంది. అయితే పీఎం 2.5 ధూళి లెవెల్స్ దాదాపు 55 శాతానికి పైగా పెరగడానికి ఫైర్ క్రాకర్స్ కారణమని భారత ప్రభుత్వం నివేదికను బట్టి అర్థం అవుతోంది. బాణాసంచాతో పాటుగా దిల్లీ, పంజాబ్ రాష్ట్రాల పరిసరాల్లో రైతులు పంట వ్యర్థాలను కాల్చడం కూడా ప్రధాన కారణంగా మారుతోంది. వీటితోపాటు వాహనాల రద్దీ కూడా దిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
