పాలమూరు ప్రాజెక్టులపై కేంద్రంతో పోరు

హైదరాబాద్‌ః మహబూబ్‌ నగర్‌ లో పెండింగ్‌ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌ నగర్‌ లోని కల్వకుర్తి, భీమా ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావలసిన క్లియరెన్స్‌ లను సత్వరం వచ్చేలా చర్యలు తీసుకోవాలని గురువారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

భీమా ప్రాజెక్టుకోసం రాష్ట్ర బడ్జెట్‌ లో కేటాయించిన 15 కోట్ల రూపాయలను సత్వరం విడుదల చేయాలని కూడా సమావేశం నిర్ణయించింది. భీమాకు అనుబంధంగా వున్న ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన 140 కోట్ల రూపాయల కోసం ప్రపంచబ్యాంకును సంప్రదించాలని సమావేశం అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ శాఖ క్లియరెన్స్‌ ను కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సత్వరం తెప్పించాలని చంద్రబాబు అధికారులను కోరారు.

నిరంతరం తీవ్రమైన దుర్భిక్షపరిస్థితులతో విలవిలలాడే మహబూబ్‌ నగర్‌ జిల్లాపై ముఖ్యమంత్రి దృష్టి సారించడం పట్ల తెలుగుదేశం పార్టీలోని ఆ జిల్లాకు చెందిన నేతల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. ఈ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తే కరవు జిల్లాగా పేరుపొందిన మహబూబ్‌ నగర్‌ జిల్లా కాస్త కోలుకుంటుందని వారు ఆశాభావంతో వున్నారు. చేసేందుకు పనిలేక, పంటలు లేక మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రజలు హైదరబాద్‌ తదితర నగరాలకు కూలీలుగా వలసవెళుతూ వుంటారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే మహబూబ్‌ నగర్‌ సస్యశ్యామలం అవుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణా ఉద్యమాన్ని నీరు కార్చేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బూజుపట్టిపోయిన ప్రాజెక్టు ఫైళ్ళ దుమ్ముదులుపుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+