టిఆర్‌ఎస్‌తో పొత్తు వుండదు:ఎమ్మెస్సార్
హైదరాబాద్: పంచాయతీరాజ్ సంస్థలఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్)తో తమకు పొత్తు వుండదనిప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు స్పష్టం చేశారు.టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునే విషయమై తాను పార్టీఅధిష్ఠానం వద్ద సంప్రదించలేదని ఆయన గురువారంవిలేకరులతో చెప్పారు. టిఆర్‌ఎస్‌తో కూడా ఈవిషయమై మాట్లాడలేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం, బిజెపి కూటమినిఓడించేందుకు వాపపక్షాలతో స్థానిక అవగాహనకుదర్చుకుని పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామనిఆయన అన్నారు. వామపక్షాల జాతీయ పార్టీలతో పాటు తమఅధిష్ఠాన వర్గం కూడా ఈ స్థానిక అవగాహనకుఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. స్థానిక సంస్థలఎన్నికల్లో ప్రచారం నిర్వహణకు మూడు, నాలుగు జిల్లాలకు ఒక్కటేసి ప్రచార కమిటీనినియమించనున్నట్లు ఆయన తెలిపారు.
కాగా, కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాల శిక్షణా శిబిరం శుక్రవారంహైదరాబాద్‌లో జరుగునుంది. ఇందుకు మాదాపూర్‌లో ఏర్పాట్లుజరిగాయి.
ఇదిలావుంటే, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుడిమాండ్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం సుముఖతవ్యక్తం చేస్తే తాము ఆ పార్టీతో కలిసి పంచాయతీరాజ్ సంస్థలఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమేననిటిఆర్‌ఎస్ నేత కె. చంద్రశేఖర్ రావుప్రకటించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంఖాయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications