స్టేషన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో అరవింద్ గౌడ్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ అనుమానాస్పద పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, రంగారెడ్డి జిల్లా ఎదులాబాద్ నివాసి అరవింద్‌గౌడ్(27) కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.
రెండు నెలల క్రితమే ఆయన వివాహం జరిగింది. మంగళవారం డ్యూటీ ముగిసిన తర్వాత ఇంటికి వెళతానని చెప్పి వెళ్లిన అరవింద్‌గౌడ్ అర్ధరాత్రి తిరిగి వచ్చారు. రెస్ట్‌రూమ్‌లో పడుకుంటానని వెళ్లిన అరవింద్ ఉదయం ఇతర సిబ్బంది వచ్చి చూసేసరికి ఉరివేసుకుని మరణించివున్నట్టుగా తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications