సింగరేణి సమ్మెవిరమణ
హైదరాబాద్ : పదమూడు రోజులుగా కొనసాగుతూవున్న సింగరేణి సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. గురువారం నాడు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన చర్చల్లో కార్మికుల ప్రధాన డిమాండ్లను యాజమాన్యంఅంగీకరించటంతో సమ్మెను విరమిస్తున్నట్టు జాయింట్ యాక్షన్ కమిటి నాయకులు ప్రకటించారు. కార్మికుల ప్రధాన డిమాండ్లుఅయిన 54 నెలల ఎరియర్స్ చెల్లింపు, డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించేందుకు యాజమాన్యంఅంగీకరిచింది.
54 నెలల బకాయిలను ఆగస్టులోపు 60 శాతం చెల్లిస్తామని యాజమాన్యం ప్రకటించింది. కార్మికులతో ఒప్పందం కుదిరిన డిమాండ్లను తీర్చేందుకు 270 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని సింగరేణి అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన చర్చలలో యాజమాన్యం తరపున సింగరేణి సిఎండి ఎపివిన్ శర్మ, డైరెక్టర్లు జిఎస్‌జి అయ్యంగార్, బెంజిమెన్, జెఎసి తరపున గట్టయ్య, భిక్షమయ్య, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. చర్చలలో రాష్ట్రవిద్యుత్ శాఖామంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications