వార్ చెరలో మరో ఆరుగురు
నిజామాబాద్: కోవర్ట్‌ల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టిన పీపుల్స్‌వార్ తాజాగా మరో ఆరుగురిని కోవర్టులన్న ఆరోపణలతో నిర్బంధించింది. ఈ ఆరుగురిలో ఒకరు దళకమాండర్ కూడా వున్నారు. వార్ చెరలో వున్నవారంతా నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు.
ఈ ఆరుగురిలో ఇద్దరిని వార్ నక్సలైట్లు ఇప్పటికే చంపివేశారని చెబుతున్నారు. ఈ తాజా అపహరణలతో నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు రంగంలోకి దిగి వార్ చెరలోని వారికోసం గాలింపు ప్రారంభించాయి. వార్ నిర్బంధించి వారిలో భీమ్‌గల్ మండలం దేవక్కపేటకు చెందిన మొర్రిదేవయ్య, సగ్గుపట్ల దేవయ్య, గంగరాయికి చెందిన శరమన్, గంగయ్య, మెండోరా గ్రామానికి చెందిన లింబా, కమ్మర్‌పల్లి మండలం ఇనాయత్‌నగర్‌వాసి స్వామి వున్నట్టుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications