చంద్రబాబు ఖండన
తిరుపతి: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అరెస్టును తెలుగుదేశం నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. ఇది కచ్చితంగా కక్షసాధింపు చర్యేనని ఆయన అన్నారు. కరుణానిధి వంటి సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రిని అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమున్నదని ఆయన ప్రశ్నించారు.
తిరుపతి నుంచి శనివారం నాడు తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళనాడు పరిణామాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, వ్యక్తిగత స్థాయి కక్షసాధింపులు రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత ఎర్రన్నాయుడు కూడా వేరొక ప్రకటనలో కరుణానిధి అరెస్టును ఖండించారు. అర్ధరాత్రి కరుణానిధిని అరెస్టు చేసిన తీరును ఆయన దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications