విజయ్ మరో సంచలనం..! భారీగా ఉద్యోగుల జీతాల పెంపు..! 20 ఏళ్ల తర్వాత..!
తమిళనాడులో రెండు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం జోసఫ్ విజయ్ (Vijay) పాలనపై తన మార్కు వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాలను నిర్వహిస్తున్న ప్రభుత్వ సంస్థ టాస్మాక్ ఉద్యోగులకు ఏకంగా 25 శాతం జీతాలు పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. దీంతో ఉద్యోగులు సంతోషంలో మునిగిపోయారు.
టాస్మాక్ మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులకు 25 శాతం వేతన పెంపును ఇవాళ తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అవినీతిని అరికట్టడం, మద్యం బాటిళ్లపై వినియోగదారుల నుండి అదనపు డబ్బు వసూలు చేయడాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల పనితీరును మెరుగుపరచడానికి తీసుకున్న తాజా చర్యలలో ఇది ఒకటి. మద్యం దుకాణాల వద్ద తరచుగా వినిపించే ఫిర్యాదులలో ఒకటైన 'బాటిల్‌కు అదనంగా 10 రూపాయలు వసూలు చేయడం' అనే విధానాన్ని ఈ వేతన పెంపు అడ్డుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేసే చర్యలకు ఉద్యోగులు ఇకపై పాల్పడకుండా ఈ వేతన పెంపు దోహదపడుతుందని మంత్రి విగ్నేష్ పేర్కొన్నారు. మెరుగైన వేతనాలు అవినీతిని తగ్గిస్తాయని, టాస్మాక్ దుకాణాల్లో జవాబుదారీతనాన్ని పెంచుతాయని ప్రభుత్వం విశ్వసిస్తోందని తెలిపారు. గత 20 ఏళ్లలో టాస్మాక్ ఉద్యోగులకు ఇలాంటి వేతన పెంపు ఎప్పుడూ అమలు చేయలేదని కూడా విగ్నేష్ తెలిపారు. సవరించిన వేతన విధానం ఉద్యోగుల సంక్షేమాన్ని మెరుగుపరచడంతో పాటు, అధిక ధరల వసూలుకు సంబంధించిన దీర్ఘకాలిక ఫిర్యాదులను పరిష్కరిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే విజయ్ సర్కార్.. ప్రార్ధనా స్ధలాలు, విద్యాసంస్థలు, బస్ స్టాండ్‌లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను మూసేశారు.














Click it and Unblock the Notifications