వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖస్టీల్ లోఘోర అగ్నిప్రమాదం
విశాఖపట్నంఃవిశాఖస్టీల్ ప్లాంట్ లో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ప్రాణనష్టం లేనప్పటికీ కోట్లు రూపాయల్లో ఆస్తి నష్టం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం కంపెనీలో గ్యాస్ కటింగ్ చేస్తున్న సందర్భంగా మ్యాన్ హోల్ లో నుంచి నిప్పురవ్వలు టన్నెల్ లో వున్న ఎలక్ట్రికల్ కేబుల్స్మీద పడ్డాయి. దీనితో 400 మీటర్ల పొడవు వుండే కేబుల్‌ల అన్నీ కాలి బుడిదయ్యాయి.
పలు పల్పిట్ లు కూడా నిరుపయోగంగా మారాయి. రష్యా, జర్మనీ సాంకేంతిక పరిజ్ఞానంతో ఈ పల్పిట్ల నిర్మాణం జరిగింది. సుమారు నాలుగు పల్పిట్లు పూర్తిగా కాలిపోయాయని చెబుతున్నారు.సరైన భద్రతా చర్యలు లేనందనే ఈ ప్రమాదం సంభవించిందని కార్మిక సంఘాలుఅరోపిస్తున్నాయి.
Comments
Story first published: Saturday, June 30, 2001, 23:53 [IST]