కాంగ్రెస్ కు అభ్యర్థులే కరవుః బాబు
శ్రీకాకుళంః ప్రజల మద్దతును కాంగ్రెస్ పార్టీ క్రమంగా కోల్పోతున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయనశ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. వివిధ బహిరంగ సభలలో పాల్గొన్నారు. జిల్లాలో వివిధ ఎం.పి.టి.సి., జడ్.పి.టి.సి. స్థానాలకు పార్టీ అభ్యర్థులుగాఎంపికైన వారిచేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయించారు.
కాంగ్రెస్ పార్టీకి కొన్ని స్థానాల్లో అభ్యర్థులే కరువవ్వడం ఆ పార్టీ ప్రజల ఆదరణ కోల్పోతున్నదనడానికి నిదర్శనమని చంద్రబాబు చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని ఆయన ఆరోపించారు. గ్రామీణాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఇతోధికంగా కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు. ముఖ్యంగాశ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతామని ఆయన హామీ ఇచ్చారు.
పదవుల కోసం అడ్డదారులు తొక్కుతున్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications