తెలంగాణా సాధనే లక్ష్యంఃటిఆర్‌ఎస్
వరంగల్‌ః తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని తెలంగాణా రాష్ట్రాన్ని సాధించాలనే లక్ష్యంతోనే స్థానిక ఎన్నికల బరిలోకి దిగానని టిఆర్‌ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర రావు తెలిపారు. గురువారం ఆయన వరంగల్ జిల్లా నర్సాపేట, పరకాల తదితర పట్టణాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణా సాధనకు ఈ ఎన్నికలు పునాది కావాలని ఆయన అన్నారు.
1968 లో తెలంగాణా ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ పాశవికంగా అణచి వేసిందని, ఆ పార్టీని ఎవరూ నమ్మవద్దని చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. తెలంగాణా అభివృద్ధి ఏ మాత్రం పట్టని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని ఆయన దుయ్యబట్టారు.
స్థానిక ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా సొంతగా సమకూర్చుకున్న హెలికాప్టర్ లో చంద్రశేఖర రావు సుడిగాలి పర్యటన జరుపుతున్నారు. సున్నిత విమర్శలతో కూడిన ప్రసంగాల ద్వారా ఆయన ప్రజలను ఆకట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications