ఖమ్మం సిఐ సస్పెన్షన్
హైదరాబాద్: ఖమ్మం పట్టణంలో బుధవారం నాడు పట్టపగలు అందరూ చూస్తుండగానేప్రముఖ వ్యాపారి తులసీదాస్‌ను దారుణంగా కాల్చిచంపిన ఖమ్మం సిఐ సర్వర్‌పాషాను పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశం మేరకు సిబిసిఐడి ప్రత్యేక బృందం ఈ సంఘటనపై దర్యాప్తు జరపడానికి హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరి వెళ్లింది.
తులసీదాస్ హత్య దరిమిలా ఖమ్మంలో నెలకొన్న ఉద్రిక్తత ఇంకా కొనసాగుతున్నది. గురువారం నాడు వాణిజ్య సంఘాల పిలుపుమేరకు పట్టణంలో బంద్ జరిగింది. సర్వర్‌పాషా ఎందుకీ దారుణానికి వడిగట్టారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. పోలీసులతో కానీ, సర్వర్‌పాషాతో కానీ ఎలాంటి వ్యక్తిగత వివాదాలు తులసీదాస్‌కు లేవని అంటున్నారు.
వ్యాపారిని కాల్చేసిన సిఐ?












Click it and Unblock the Notifications