హురియత్‌పై బాణీమార్చిన ముషర్రాఫ్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ భారత్‌విజ్ఞప్తులను అన్నింటినీ పక్కకు నెట్టిహురియత్ కాన్ఫరెన్స్ నేతలను విందుకుఆహ్వానించింది. ఈ నెల 14వ తేదీన పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషర్రాఫ్ గౌరవార్థం తాను ఇచ్చే విందుకహాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ పాక్‌హైకమిషనర్ అష్రాఫ్ జహంగీర్ ఖాజీ అఖిల పక్షహురియత్ కాన్ఫరెన్స్ నేతలకు ఆహ్వానాలుపంపారు. ఈ విషయాన్ని హురియత్ వర్గాలుధృవీకరించాయి.
చర్చల్లో హురియత్‌కు ఎటువంటి పాత్రాలేదని, వారిని విందుకు కూడా పిలవవద్దని భారత ప్రభుత్వం ఎంత చెప్పినా పాక్‌వినలేదు. మరో వైపు పర్వేజ్ ముషర్రాఫ్ కూడా బాణీమార్చారు. హురియత్‌కు భాగస్వామ్యం లేనిచర్చలు అర్థవంతం కావని ఆయన అన్నారు. ఈ నెల 15వ తేదీనతాను ప్రధాని వాజ్‌పేయితో జరుపుతున్న శిఖరాగ్రచర్చల్లో హురియత్ నేతలకు భాగస్వామ్యం కల్పించకపోతేచర్చలు అసమగ్రంగానే ముగుస్తున్నాయని ఆయనవ్యాఖ్యానించారు. నిర్ణయం భారత ప్రభుత్వానిదే.కాదనటం లేదు. అయితే వారిని నన్నుకలుసుకోనివ్వటం న్యాయమని మాత్రమే నేనుచెప్పదలుచుకున్నాను ఆయన అన్నారు. తాజాగా జీ-టీవీకి ఇచ్చినఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా అన్నారు.
భారత పర్యటనలోహురియత్ కాన్ఫరెన్స్ నేలను కలుసుకోవాలనితాను ఉవ్విళ్లూరుతన్నట్లు ఆయన తెలిపారు. భారత్‌లో గడిపేసమయంలో ఎలాగోలా ఏదో దశలో వారిని కలుసుకోవాలనితాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. వారిని ఏదశలో చర్చల టేబుల్ వద్దకు తీసుకురావాలనేవిషయం గురించి ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.నన్ను కలుసుకునేందుకు వారికి ఏదోదశలో అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు కాకపోతేతర్వాతనైనా సరే. కాశ్మీర్ విషయంలో మేం కొంతపురోగతి సాధిస్తే ఆ తర్వాత వారిని ఏదో దశలో చర్చల్లో చేర్చాలనినేను కోరబోతున్నాను. ఎందుకంటే వారిఆశలు, ఆలోచనలు పట్టించుకోకుండా సమస్య పరిష్కారంకాబోదు. హురియత్ నేతలు లేకుండా కాశ్మీర్ సమస్య పరిష్కారంఅసాధ్యం. వారిని ఎంత తొందరగా చర్చల్లో చేరిస్తే అంతమంచిది అని ముషర్రాఫ్ అన్నారు.
భారత దేశంతో నిర్యుద్ధ సంధినికుదుర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లుఆయన ప్రకటించారు. మొదట అణ్వాయుధాలు ప్రయోగించకుండాఉండేందుకు ఒప్పందం కుదుర్చుకుందామని భారత్‌ప్రతిపాదిస్తోంది. అయితే మరో అడుగు ముందుకేసినిర్యుద్ధ సంధిని కుదుర్చుకోవడానికి నేనుసిద్ధంగా ఉన్నాను అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications