అవసరమొచ్చినప్పుడేరాజకీయాలు: పివి
హైదరాబాద్: దేశరాజకీయాలపై అవసరం వచ్చినప్పడుమాట్లాడుతానని మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుఅన్నారు. తమిళనాడులోని, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనిరాజకీయ పరిణామాలపై వ్యాఖ్యానించేందుకుఆయన నిరాకరించారు. తన 81వ జన్మదినోత్సవాన్ని ఆయన ఇటీవల జరుపుకున్నారు. ఈసందర్భంగా ఆయనను రాజభవన్‌లో అభిమానులు,కాంగ్రెస్ కార్యకర్తలు సన్మానించారు. ఈ వయసులో కూడాతాను ఆరోగ్యంగానే వున్నానని ఆయన తనను కలుసుకున్నవిలేకరులతో అన్నారు.
తమిళనాడులో కరుణానిధి,ఇద్దరు కేంద్ర మంత్రుల అరెస్టు, ఆ రాష్ట్రంలోరాజకీయ పరిస్థితులపై పత్రికలవారు ఎన్ని ప్రశ్నలువేసినా ఆయన సమాధానం చెప్పలేదు.రాజకీయాలపై వ్యాఖ్యానించేందుకు ఇప్పుడు తానున్నచోటు సరైనది కాదని ఆయన అన్నారు.
క్రియాశీలక రాజకీయాల్లో తిరిగిచురుగ్గా పాల్గొనే విషయంపై అడిగిన ప్రశ్నలకు కూడాఆయన సమాధానాలు చెప్పలేదు.












Click it and Unblock the Notifications