చర్చలకు సోనియా శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ అధినేత ముషారఫ్, భారత ప్రధాని వాజ్‌పేయి మధ్య జరుగనున్న శిఖరాగ్ర చర్చలు సఫలం కావాలని కోరుతున్నట్టు కాంగ్రెస్ నేత సోనియాగాంధీ ప్రకటించారు. ఈ చర్చలు ఉభయ దేశాల మధ్య సంబంధాల్లో కీలకమైన మైలు రాయిగా ఆమె అభివర్ణించారు.
పాకిస్తాన్‌తో సంబంధాలకు వాజ్‌పేయి ప్రభుత్వం ప్రయత్నాలను తాము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్టుగా ఆమె తెలిపారు. విదేశీ పర్యటననుంచి బుధవారం నాడు రాత్రి తిరిగి వచ్చిన సోనియాకు విమానాశ్రయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, భారత్-పాక్ చర్చలు శుభ పరిణామంగా ఆమె పేర్కొన్నారు. తమిళనాడు పరిణాల గురించి పార్టీనేతలు సోనియాకు వివరించారు. ఈ వ్యవహారంపై ఆమె ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.












Click it and Unblock the Notifications